కామారెడ్డిటౌన్, వెలుగు : రోడ్డు ప్రమాదాలను నివారించాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. గురువారం రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్, ఎస్పీ రాజేశ్చంద్ర, సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయొద్దన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించేలా విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి జె. శ్రీనివాస్, రవాణా శాఖ , పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.
