జ్యోతిష్యం: ఆగస్టు నెల వృషభరాశి.. ఈ రాశి వారికి దశ తిరిగినట్లే.. చేయాల్సిన పరిహారాలు ఇవే..!

జ్యోతిష్యం:  ఆగస్టు నెల వృషభరాశి.. ఈ రాశి వారికి దశ తిరిగినట్లే.. చేయాల్సిన పరిహారాలు ఇవే..!

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 2026 ఆగస్టు నెలకు చాలా ప్రాధాన్యత ఉంది.. ఈ నెలలో సూర్యగ్రహణంతో పాటు కీలక గ్రహాలు వాటి స్థానాలు మారనున్నాయి.  ఈ నేపథ్యంలో ఈ నెలలో వృషభరాశి వారి ఏ రంగంలో కలసి వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఆగస్టు 2026 గ్రహాల సంచారం ఆధారంగా వృషభ రాశి వారికి  లాభ స్థానంలో శనీశ్వరుడు, పంచమంలో రాశ్యధిపతి శుక్రుడి సంచారం కారణంగా ఆర్థికంగా బలం పెరిగు అవకాశం ఉంది.  కుటుంబంలో సమస్యలు పరిష్కారమవుతాయి.  దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబసభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.  సుఖ సంతోషాలతో జీవితం కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు.

ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.  కీలక విషయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది.  ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఇతరులకు వీలైనంతగా ఆర్థిక సహాయం అందిస్తారు. .ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 

ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు.  వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధి స్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

పరిహారాలు:  సోమవారం: పరమేశ్వరుని అభిషేకం

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.