కలెక్టర్ చొరవతో అనాథ విద్యార్థుల విహార యాత్ర

కలెక్టర్ చొరవతో అనాథ విద్యార్థుల విహార యాత్ర

కామారెడ్డిటౌన్, వెలుగు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చొరవతో జిల్లా కేంద్రంలోని బాల సదనం విద్యార్థులు విహార యాత్రకు వెళ్లారు. 65 మంది అనాథ పిల్లలు కామారెడ్డి బాల సదనంలో 
ఉంటున్నారు. సెలవుల దృష్ట్యా వీరిని కలెక్టర్ విజ్ఞాన యాత్రకు పంపారు.

హైదరాబాద్​లోని సాలర్​జంగ్ మ్యూజియంలోని పురాతన వస్తువులు, శిల్ప కళా నమూనాలను విద్యార్థులు 
పరిశీలించారు. ఇలాంటి విహార యాత్రలు పిల్లల్లో  విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్​లో ఇలాంటి కార్యక్రమాలను మరింతగా ప్రోత్సహిస్తామని తెలిపారు.