V6 News

ప్లీజ్‌‌‌‌‌‌‌‌ డోంట్‌‌‌‌‌‌‌‌ క్రై.. మనం ఓడి గెలిచాం..పోలింగ్‌‌‌‌‌‌‌‌కు ముందు రోజు పైసలు పంచ.. మందు తాప అనే బోర్డు ఏర్పాటు

ప్లీజ్‌‌‌‌‌‌‌‌ డోంట్‌‌‌‌‌‌‌‌ క్రై.. మనం ఓడి గెలిచాం..పోలింగ్‌‌‌‌‌‌‌‌కు ముందు రోజు పైసలు పంచ.. మందు తాప అనే బోర్డు ఏర్పాటు
  • ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేసిన ఓడిన సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌

కామారెడ్డి, వెలుగు : ‘ప్లీజ్‌‌‌‌‌‌‌‌ డోంట్‌‌‌‌‌‌‌‌ క్రై.. మనం ఓడి గెలిచాం’ అంటూ ఓడిపోయిన సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తన ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా మైత్రేయి బరిలో నిలిచారు. ఇక్కడ మొదటి విడతలో పోలింగ్‌‌‌‌‌‌‌‌ జరుగగా.. గురువారం అర్ధరాత్రి వరకు లెక్కింపు జరిగింది. 

ఎన్నికల్లో మైత్రేయికి 335 ఓట్లు రావడంతో ఓటమిపాలయ్యారు. దీంతో ‘ప్లీజ్‌‌‌‌‌‌‌‌ డోంట్‌‌‌‌‌‌‌‌ క్రై.. మనం ఓడి గెలిచాం, నేను 335 మందికి ప్రతినిధిని, నన్ను నమ్మినవారికి ధన్యవాదాలు’ అని రాసిన బోర్డును ఇంటి ముందు ఏర్పాటు చేశారు. పోలింగ్‌‌‌‌‌‌‌‌కు ముందు రోజు సైతం తన ఇంటి ముందు ‘నేను మందు తాప.. పైసలు పంచ’ అంటూ బోర్డును ఏర్పాటు చేయడం గమనార్హం.