ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు :  జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం రాష్ర్ట ఎన్నికల అధికారి రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో చర్చించిన తర్వాత, కలెక్టర్ స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించి పీవో, ఓపీవో, ఆర్వోలకు ట్రైనింగ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ ఏర్పాటు, నోడల్ అధికారుల నియమాకం, ఎన్నికల రిసెప్షన్ సెంటర్లు, డిస్రిబ్యూషన్ పాయింట్లు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎస్పీ రాజేశ్​చంద్ర, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, డీపీవో మురళీ, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీఎల్ పీవోలు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.