కామారెడ్డి, వెలుగు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రభుత్వ ఉద్యోగి మృతిచెందాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్‌కు చెందిన కె.మహేశ్(30) బిచ్కుంద కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గురువారం సంగమేశ్వర్ నుంచి కామారెడ్డికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో హైవేపై గుర్తు తెలియని వాహనం ఆయనను ఢీకొట్టింది. తలపై నుంచి వెహికల్ వెళ్లడంతో మహేశ్ స్పాట్లో చనిపోయాడు.
