బీఆర్ఎస్ రద్దయిన నోటు : వెంకట రమణారెడ్డి

బీఆర్ఎస్ రద్దయిన నోటు : వెంకట రమణారెడ్డి

చౌటుప్పల్​, నకిరేకల్, వెలుగు బీఆర్ఎస్ ​పార్టీ రద్దయిన నోటు లాంటిదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి విమర్శించారు. నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోని నకిరేకల్​, మునుగోడు, చౌటుప్పల్, సంస్థాన్​ నారాయణపురం​మండలాల్లో గురువారం నిర్వహించిన విజయ సంకల్పయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలు బీజేపీతో పొత్తు అంటూ ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ ఉండదని స్పష్టం చేశారు.  

కాంగ్రెస్​, బీఆర్ఎస్​ ఒక్కటేనని, ఈ పార్టీల లీడర్లు రాజకీయాలంటే విలువ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.  అసెంబ్లీలో ఆ పార్టీల లీడర్లు మాట్లాడిన రెచ్చగొట్టే డైలాగులే ఇందుకు నిదర్శనమన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నల్గొండలో సభ పెడితే ప్రస్తుత సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ పేరిట టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లారని విమర్శించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 75 రోజులు దాటినా హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం సీటుతో సహా తెలంగాణలో 17 ఎంపీ  స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్‌‌లో ఒక ఎమ్మెల్యే సీటుంటేనే రాష్ట్రంలో నాలుగు ఎంపీలు గెలిచామన్నారు. ప్రస్తుతం  ఎనిమిది మంది ఎమ్మెల్యేలం ఉన్నామని, 17 సీట్లు పక్కాగా గెలుస్తామన్నారు. మాజీ సీఎం, ప్రస్తుత  సీఎంను ఓడించిన ఘనత బీజేపీ కార్యకర్తలదని, ఇదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఆయన వెంట బీజేపీ స్టేట్ జనరల్​ సెక్రటరీలు గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్​ రెడ్డి, మాజీ ఎంపీ బూ ర నర్సయ్య గౌడ్​, పాశం భాస్కర్, నాగం వర్శిత్  రెడ్డి, రమణ గోని శంకర్, మండల వెంకన్న, శ్రీను ఉన్నారు.