కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం

కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్ జాహ్నవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేయాలని తీర్మానం చేసింది. సమావేశానికి హాజరైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. ముసాయిదా తయారు చేసిన డిజైన్ డెవలప్ మెంట్  ఫోరం, డీటీసీపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తీర్మానం కాపీతో పాటు కొత్త మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వానికి పంపారు. 

మాస్టర్ ప్లాన్లో తప్పులు ఉన్నందునే రైతులు ఆందోళన చేస్తున్నారని కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ జాహ్నవి అన్నారు. దాన్ని గతంలోనే తాము తిరస్కరించామని చెప్పారు. ఈ విషయంలో కొన్ని ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టి్స్తున్నాయని ఆరోపించారు. విలీన గ్రామాలను ఇండస్ట్రియల్ జోన్ లో చేర్చేందుకు ఏ మాత్రం అంగీకరించమని జాహ్నవి స్పష్టం చేశారు. రైతుల వెంటే తాము ఉంటామని, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. 60 రోజుల్లో స్వీకరించిన అభ్యంతరాలన్నింటినీ ప్రభుత్వానికి పంపించామని, ఎట్టి పరిస్థితుల్లోను గ్రామాలను ఇండస్ట్రియల్ జోన్ లో చేర్చమని జాహ్నవి స్పష్టం చేశారు.