
కామారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాను ఇంతగా వరదలు ముంచెత్తడం ఎప్పుడూ చూడలేదని, విపత్కర పరిస్థితుల్లో ప్రజల సహకారం, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో జిల్లాను సాధారణ పరిస్థితుల్లోకి తెచ్చామని ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. సోమవారం కామారెడ్డి పట్టణంలో వరద బాధితులకు సేవ చేసినవారిని ఎస్పీ సత్కరించి మాట్లాడారు.
పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు. జేసీబీ డ్రైవర్లు, వలంటీర్లు, యువత, మున్సిపల్ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి సేవలు చేయడం అభినందనీయమన్నారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ బి.చైతన్య రెడ్డి, కామారెడ్డి టౌన్ ఎస్హెచ్వో నరహరి, కామారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్రామన్, భిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్, ఎస్సైలుపాల్గొన్నారు.