మమ్మల్ని కన్సిడర్ చేయండి : కాంగ్రెస్ పెద్దలతో.. తెలంగాణ కమ్మవారి ఐక్య వేదిక భేటీ

మమ్మల్ని కన్సిడర్ చేయండి : కాంగ్రెస్ పెద్దలతో.. తెలంగాణ కమ్మవారి ఐక్య వేదిక భేటీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయటానికి.. టికెట్లు డిమాండ్ చేశారు కమ్మవారి ఐక్య వేదిక నేతలు. ఈ మేరకు కొన్నాళ్లు చేస్తున్న ఆందోళనలకు.. మాజీ ఎంపీ రేణుకాచౌదరి నాయకత్వం వహిస్తున్నారు. మొదటి లిస్టులో ఎలాంటి సీట్లు కేటాయించకపోవటంతో.. రెండో లిస్టులో అయినా కమ్మవారికి సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అక్టోబర్ 27వ తేదీ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు నేతలు. 

ఏఐసీసీ మీటింగ్ ముగిసిన తర్వాత.. కమ్మవారి ఐక్యవేదిక నేతలను.. ఆఫీసు లోపలికి తీసుకెళ్లారు రేణుకా చౌదరి. తన వర్గం నేతలకు టికెట్లు ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 30 నియోజకవర్గాల్లో కమ్మ కులం వారికి ఫలితాలను  ప్రభావితం చేయగల సామర్ధ్యం ఉందని.. కనీసంలో 12 సీట్లు ఇవ్వాలంటూ రేణుకాచౌదరి ఆధ్వర్యంలోని కమ్మవారి ఐక్యవేదిక నేతలు.. ఏఐసీసీ పెద్దలకు విన్నవించుకున్నారు. 

Also Read :- రేషన్ కుంభకోణం.. మంత్రి అరెస్ట్

రేణుకాచౌదరి వర్గానికి చెందిన కమ్మవారి ఐక్య వేదిక డిమాండ్లకు కాంగ్రెస్ అధిష్టానం తలొగ్గుతుందా.. సీట్లు ఇస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి కమ్మ కులం వారి సత్తా తెలంగాణలో చూపించాలనే కసితో ఉన్నట్లు.. ప్రస్తుత పోరాటం అయితే చెబుతోంది.