హైదరాబాద్ లో నారాయణి సిల్క్స్ షోరూమ్ షురూ

హైదరాబాద్ లో నారాయణి సిల్క్స్ షోరూమ్ షురూ

హైదరాబాద్​, వెలుగు:  పట్టు చీరలకు, సంప్రదాయ చేనేత వస్త్రాలకు నిలయమైన కాంచీపురం నారాయణి సిల్క్స్  హైదరాబాద్, గచ్చిబౌలి మెయిన్ రోడ్డులో శుక్రవారం షోరూమ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. ఇక్కడ పండగ వస్త్రాలు, పెళ్లికూతురు పట్టుచీరలు అద్భుతమైన శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి.   తమ బ్రాండ్ సంప్రదాయాన్ని, ఆధునిక జీవనశైలిని ప్రతిబింబిస్తుందని, నాణ్యత, విశ్వసనీయత, అందుబాటు ధరలతో అన్ని తరాల వినియోగదారులను ఆకర్షిస్తోందని సంస్థ తెలిపింది.

 గచ్చిబౌలి పరిసర ప్రాంత కస్టమర్లను అలరించేలా కాంచీపురం పట్టు వెరైటీలను పరిచయం చేయడం ఆనందంగా ఉందని చైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చిరకాల సంప్రదాయాన్ని నేటి కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎండీ సీర్ణ రాజమౌళి పేర్కొన్నారు. వివాహాది శుభకార్యాలకు సరిపోయే అత్యుత్తమ నాణ్యత గల వస్త్రాలను ఇక్కడ అందిస్తున్నట్లు డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు ఈ సందర్భంగా వివరించారు.