ఏడేండ్లయినా సొంత బిల్డింగ్ లేకపోవడంతో సంగారెడ్డి జిల్లా కంది మండలంలో సమావేశాల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ క్లాస్‌రూంలో మండల సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం కంది ఎంపీపీ సరళ అధ్యక్షతన కంది మండల జనరల్‌బాడీ మీటింగ్నిర్వహించారు. ఇందుకోసం జడ్పీహెచ్ఎస్ స్కూల్పదో తరగతి క్లాస్‌రూం ఖాళీ చేయించారు. పిల్లలను మరో రూంలోకి పంపించారు. మీటింగ్పూర్తయ్యేవరకు పిల్లలు ఎలాంటి క్లాసులు లేకుండా ఖాళీగా కూర్చున్నారు.
ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. స్కూల్ఆవరణలో ఖాళీగా ఉన్న రెండు పాత గదుల్లో మండల ఆఫీస్ఏర్పాటు చేశారని, మండలం ఏర్పడి సుమారు ఏడేండ్లు గడిచిన ఇప్పటివరకు సొంత బిల్డింగ్కట్టలేదన్నారు. మీటింగ్‌లు పెట్టుకోవడానికి అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆఫీసర్లకు సూచించారు. ఎంపీడీవో విశ్వప్రసాద్, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.
