ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి

ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947లో కాదని.. 2014లో ప్రధాని మోడీ ప్రధాని అయిన తర్వాతే అసలైన స్వాతంత్ర్యం వచ్చిందంటూ కామెంట్ చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను 'రాణి లక్ష్మీబాయ్' సినిమా చేశానని.. 1857 మొదటి స్వాతంత్ర్య పోరాటంపై అధ్యయనం చేశానని..ఆ సమయంలో తనకు జాతీయవాదం పెరిగిందని చెప్పారు.

భగత్ సింగ్ ను గాంధీ ఎందుకు కాపాడలేకపోయారు? సుభాష్ చంద్రబోస్ ఎందుకు చనిపోయారు? దేశ విభజన రేఖను తెల్లవారు ఎందుకు గీశారు? స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతీయులు వేడుకలు జరుపుకోకుండా ఒకరినొకకరు ఎందుకు చంపుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెపితే పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని అన్నారు.

అంతేకాదు..1987లో జరిగిన యుద్ధం గురించి తనకు తెలుసని.. కానీ 1947లో ఏం జరిగిందనే దాని గురి తనకు ఎవరైనా చెప్పాలని అన్నారు కంగన. తన ఇంటర్వ్యూలో అన్ని విషయాలను తాను చాలా క్లియర్ గా చెప్పానని... అయితే కేవలం ఎడిట్ చేసిన వీడియో క్లిప్స్ ను మాత్రమే వైరల్ చేసి తనను విమర్శలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఇంటర్వ్యూలో అమరవీరులను తాను అవమానించినట్టు చూపిస్తే పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని అన్నారు.