
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సారి బీటౌన్ స్టార్ హీరోయిన్లను టార్గెట్ చేసింది. చాలా మంది ఏ– లిస్ట్ హీరోయిన్లు ఫ్రీగా పనిచేస్తారని.. దర్శకనిర్మాతలకు ఉచితంగా ఫేవర్ చేస్తారని కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హిందీ పరిశ్రమలో మేల్ ఫీమేల్ నటుల రెమ్యూనరేషన్లో ఉండే తేడా గురించి ప్రస్తావించింది.
ఇప్పటికీ కొందరు హీరోయిన్లు ఫ్రీగా సినిమాలు చేయడానికి రెడీగా ఉంటున్నారని తెలిపింది. కీలక పాత్రలు దూరమవుతాయనే కారణంతో వారు ఇతర మార్గాలలో ఫేవర్ చేస్తుంటారని చెప్పింది. కానీ, తాను మాత్రం హీరోలకు దీటుగా పారితోశకం తీసుకుంటున్నానంది. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలే ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఈ బ్యూటీ కామెంట్లకు అర్థం ఏంటని చర్చించుకుంటున్నారు. ఫ్లాపులు వచ్చినా ప్రయోగాలు వీడని కంగనా ప్రస్తుతం స్వీయ దర్వకత్వంలో ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఇందుకోసం తన ఆస్తులను సైతం తనఖా పెట్టింది.