Kangana Ranaut: వరుస ఫెయిల్యూర్స్తో కంగనా.. సక్సెస్‌‌ కోసం సీక్వెల్స్‌‌ వైపు

Kangana Ranaut: వరుస ఫెయిల్యూర్స్తో కంగనా.. సక్సెస్‌‌ కోసం సీక్వెల్స్‌‌ వైపు

ఓ వైపు ఎంపీగా రాజకీయాల్లో రాణిస్తున్న బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్‌‌... మరోవైపు సినిమాల్లోనూ తనదైన మార్క్‌‌తో మెప్పించేందుకు రెడీ అవుతోంది. గత కొన్నాళ్లుగా వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోది కంగన. కానీ సరైన సక్సెస్ వచ్చి చాలా కాలమైంది. దీంతో తన కెరీర్‌‌‌‌కు బూస్టప్‌‌ ఇచ్చిన ఐకానిక్‌‌ సినిమాలకు సీక్వెల్స్‌‌ చేయాలని ప్లాన్ చేస్తోంది.

అందులో ఒకటి ‘క్వీన్‌‌’ సీక్వెల్‌‌. 2014లో వచ్చిన క్వీన్‌‌ చిత్రం ఆమె కెరీర్‌‌‌‌లో గేమ్‌‌ చేంజర్‌‌‌‌గా నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు వికాస్‌‌ బహల్‌‌ ఇప్పటికే సీక్వెల్‌‌ కోసం స్క్రిప్ట్‌‌ రెడీ చేసి, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌‌ స్టార్ట్ చేశాడు. నవంబర్‌‌‌‌ నుంచి ఈ చిత్రం సెట్స్‌‌కు వెళ్లబోతోందని సమాచారం. మరోవైపు ‘తను వెడ్స్‌‌ మను’కు కూడా సీక్వెల్‌‌ రాబోతోంది.

ఇప్పటికే ‘తను వెడ్స్‌‌ మను రిటర్న్స్‌‌’ పేరుతో రెండో భాగం రాగా, ఇప్పుడు మూడో భాగానికి గ్రౌండ్‌‌ వర్క్ జరుగుతోంది. ‘తేరే ఇష్క్‌‌ మే’ తర్వాత దర్శకుడు ఆనంద్‌‌ ఎల్‌‌ రాయ్‌‌ చేయబోయే సినిమా ఇదేనని తెలుస్తోంది.

కంగన ఎంపీగా కొనసాగుతున్న క్రమంలో షార్ట్‌‌ టైమ్‌‌లో షూటింగ్‌‌ కంప్లీట్ చేసేలా షెడ్యూల్స్‌‌ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి తన సూపర్ హిట్ సినిమాల సీక్వెల్స్‌‌తో తిరిగి నటిగా సక్సెస్‌‌ అవ్వాలనే ప్రయత్నాలు చేస్తోంది కంగన.

అయితే, చంద్రముఖి 2, తేజస్, ఎమర్జెన్సీ వంటి సినిమాలతో ఫెయిల్యూర్స్తో ఉంది. ఇప్పుడిక సీక్వెల్స్ తో ఎలాంటి సక్సెస్ అందుకోనుందో తెలియాల్సి ఉంది.