
న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నమెంట్‌తో కంగనా రనౌత్‌కు డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ క్వీన్‌కు కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీని కల్పించింది. దీనిపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు. కంగన తండ్రి కోరిక మేరకు సెక్యూరిటీని ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ సెక్యూరిటీకి సంబంధించి అయ్యే బిల్లుల డబ్బులను ఎవరు భరిస్తారనే దానిపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇవ్వలేదు. తన కూతురుకు సెక్యూరిటీ కల్పించాలని హిమాచల్ సర్కార్‌ను కంగన తండ్రి రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంపై హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్‌కు కంగన ఫాదర్ లేఖ రాశారు. దీంతో కంగనాకు సెక్యూరిటీ కల్పించాలని హిమాచల్ సర్కార్ కేంద్రాన్ని కోరింది. వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కింద కంగనాకు 10 నుంచి 11 మంది కమాండోలు రక్షణ వలయంగా నిలుస్తున్నారు.