
ఓటీటీలో థ్రిల్లర్ సిరీస్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా హిందీ, మలయాళ భాషల నుంచి వచ్చే సిరీస్‌లకు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూ ప్రధానపాత్రలో నటించిన హిందీ వెబ్ సిరీస్ ‘కన్‌ఖజురా’.మోహిత్ రైనా, సారా జేన్ డయాస్, త్రినేత్ర హల్దార్, మహేష్ శెట్టి, నినాద్ కామత్, హీబా షా, ఉషా నద్కర్ణి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. చందన్ అరోరా దీనికి దర్శకుడు. అజయ్ రాయ్ నిర్మించారు.
It’s fragile. It’s fatal. It’s coming.
— Sony LIV (@SonyLIV) May 2, 2025
Kankhajura — Streaming on 30th May on Sony LIV.#KanKhajura #SoFragileYetSoFatal#MohitRaina @roshanmathew22 @sarahjanedias03 #TrinetraHaldarGummaraju #NinadKamat #MaheshShetty #HeebaShah pic.twitter.com/FxUDjHUsaW
‘కన్‌ఖజురా’అంటే జెర్రి అని అర్థం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జెర్రి చిన్న కీటకమే కదా అని చిన్నచూపు చూస్తే అది ఎలా ప్రమాదకరంగా మారిందనే కోణంలో ఈ టైటిల్ పెట్టారు. జైలు జీవితం గడిపి బయటకొచ్చి పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మారతాడు అషు. గతంలో తనను నిస్సహాయుడిగా ఆడుకున్న వాళ్లపై అతను ఎలాంటి రివెంజ్ తీర్చుకున్నాడనేది మెయిన్ కాన్సెప్ట్.
ప్రధానంగా ఇది ఇద్దరు విడిపోయిన అన్నదమ్ముల మధ్య జరిగే పోరు. వాళ్లిద్దరి చీకటి గతం, ప్రస్తుతం నేపథ్యంలో సాగే ఎమోషనల్ థ్రిల్లర్. విమర్శకుల ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ ‘మాగ్పీ’కి రీమేక్‌గా హిందీలో తెరకెక్కించారు.
గోవా చుట్టుపక్కల ప్రాంతాలు, అక్కడి నేరాల చుట్టూ తిరిగే కథగా మార్పులు చేశారు. తన పాత్ర గురించి రోషన్ మాథ్యూ మాట్లాడుతూ ‘అషు నా క్యారెక్టర్‌లో చాలా లేయర్స్ ఉంటాయి. క్షణానికో రకంగా మారుతుంటుంది. కానీ లోపల నిశ్శబ్ద తుఫాను ఉంటుంది. ఈ కథ అందరి హృదయాల్ని కదిలించడమే కాకుండా వెంటాడుతుంది’అని చెప్పాడు. ఈనెల 30 నుంచి సోనీ లివ్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.