
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNTU) స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీహార్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు.ఆయన స్వస్థలమైన బెగుసరాయ్ స్థానం నుంచి సీపీఐ అభ్యనిగా బరిలో దిగుతున్నారు. ముందుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ఆర్జేడీ పార్టీలు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కన్నయ్యకు మద్దతు తెలిపాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా కొన్ని సీట్లలో మాత్రమే పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు వామపక్ష పార్టీలు తెలిపాయి. బీహార్‌లో ప్రధాన వామపక్ష పార్టీ సీపీఐ(ఎంఎల్) మహాకూటమిపై మండిపడింది. ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్న మహాకూటమిలో తమకు సీట్లను కేటాయించకుండా కొన్ని పార్టీలతో మాత్రమే పొత్తుపెట్టుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కన్నయ్య రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు కేటాయించారు. దీంతో సీపీఐ తరపున కన్నయ్య పోటీకి దిగుతున్నారు.