Success Story: ఆ వ్యాపారంలో ఏడాదికి రూ. 30 లక్షల ఆదాయం.. అది ఏంటంటే..

Success Story: ఆ వ్యాపారంలో ఏడాదికి రూ. 30 లక్షల ఆదాయం.. అది ఏంటంటే..

ఆ వ్యాపారం ఆ మహిళను లక్షాధికారిని చేసింది.  రూ. 10 లక్షల లోన్​ ను  తీర్చేశారు. అంతే కాదు  20నుంచి 30 లక్షల వరకు ఆదాయం సంపాదించారు.   జొన్నలు.. రాగులు... ముతక ధాన్యాలు ఆమె జీవితాన్ని మార్చేశాయి.  ఆ మహిళ ఎలా వ్యాపారం చేసింది.. అన్ని లక్షలు ఎలా సంపాదించారు.. ఆమె వ్యాపారంలో ఉన్న రహస్యమేంటో తెలుసుకుందాం. . .

వ్యవసాయం అంటే  భయపడే రోజుల్లో  ఉత్తర ప్రదేశ్​ ... కాన్పూర్​ కు చెందిన మహిళ కు చిరు ధాన్యాలను పండించి స్వయంగా అమ్మడం మొదలు పెట్టారు సంగా సింగ్​.  రాగులు, జొన్నలు వంటి ముతక ధాన్యాలు ఇంకా బీట్‌రూట్, బచ్చలికూర మరియు క్యారెట్‌ల చిప్స్​ చేసి మార్కెట్లో విక్రయించారు. వీటి కోసం  రెండేళ్ల క్రితం పీఎంఈజీపీ పథకం కింద రూ.10 లక్షల రుణం తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించి అనేక సవాళ్లను ఎదుర్కొని చివరకు విజయం సాధించి.. ఇప్పుడు ఏడాదికి 20నుంచి 30 లక్షల రూపాయిలను సంపాదిస్తున్నారు. 

మిల్లెట్ల ఉపయోగం గురించి ప్రజలకు వివరించారు.. మొదట్లో ఇంటి వద్ద ఒక మొక్కను నాటి వ్యాపారం ప్రారంభించి .. ప్లాంట్​ ఏర్పాటుకు లోన్​ తీసుకున్నారు.  వ్యాపార రంగంలో వచ్చే ఆటు పోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగారు సంగీత.  తన వ్యాపారానికి ప్రజల ఆదరణ లభించేందుకు పడిన కష్టం అంతా ఇంతాకాదు.  గుర్తింపు వచ్చిన తరువాత  ఒక ఏడాదిలోనూ తాను తయారు చేసిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం మొదలు పెట్టారు.  ఇటీవల యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్​ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సంగీతను ఆహ్వానించింది. జొన్న, మినుము, రాగులు  మొక్కజొన్నలను ఉపయోగిస్తానని సంగీత చెప్పారు.

సంగీత తయారు  చేసే ఉత్పతుల్లో చిరుధాన్యాలను వాడుతున్నట్లు తెలిపారు.  వీటిని ఆన్​ లైన్​లో విక్రయం ప్రారంభించిన మూడు నెలల తరువాత వ్యాపారం పుంజుకుందని వివరించారు.  ఇప్పుడు  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో సహా అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అమ్ముడవుతున్నట్లు తెలిపారు.   జపాన్, దుబాయ్, టర్కీ,  ఫ్రాన్స్  దేశాల నుంచి బాగా ఆర్డర్లు వస్తున్నాయన్నారు. 

గతంలో ప్రధాని మోదీ కాన్పూర్​ పర్యటనకు వచ్చినప్పుడు తన ప్రాజెక్ట్​ గురించి వివరించానని సంగీత తెలిపారు.  తనతో పాటు చాలా మందికి ఉపాధి కల్పించినందుకు ప్రధాని సంతోషం వెలిబుచ్చారని ఆమె తెలిపారు.  ముతక ధాన్యాలు తీసుకునే వారికి కాల్షియం లోపం ఉండదన్నారు.  మిల్లెట్‌లు గోధుమలు.. బియ్యంతో సమానమైన ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి.  100 గ్రాముల మిల్లెట్ తింటే, మనకు 7-12 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.  ఇది అమైనో ఆమ్లాలతో తయారు చేయబడుతుంది.  గోధుమలు,  బియ్యంలో కంటె ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయని వివరించారు. వీటిని తినడం వలన ఎముకలు దృఢంగా ఏర్పడి.. శరీరంలో కాల్షియం సరఫరా అవుతుందన్నారు.  జీర్ణవ్యవస్థ బలోపేతమై.. రక్తం సరఫరాలో ఎలాంటి లోపాలుండవన్నారు. షుగర్​ వ్యాధి ఉన్న వారు మిల్లెట్లు తింటే కంట్రోల్​ లో ఉండి.. గుండెకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు.