కన్నడ వర్సటైల్ యాక్టర్ కిషోర్ కుమార్ (Kishore Kumar) సినీ ఆడియన్స్కి పరిచయం అక్కర్లేని పేరు. కన్నడ చిత్రసీమతో పాటు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో విభిన్నపాత్రలు పోషించారు. కాంతార ఫస్ట్ పార్ట్లో ఫారెస్ట్ ఆఫీసర్ మురళి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈయన ఏ విషయంపైన అయినా తన అభిప్రాయాలను సూటిగా వెల్లడిస్తారు. దేశ వ్యవస్థలపై, రైతులకు సంబంధించిన అంశాలపై తన గళాన్ని ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటారు.
లేటెస్ట్గా నటుడు కిషోర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పీఎం మోడీని ప్రశ్నిస్తూ సంచలన ట్వీట్ చేశారు. జాతీయ ఐక్యతపై ప్రధాని చేసిన పిలుపును ప్రశ్నిస్తూ కిషోర్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ముందుగా మత, కుల విభజనలను ప్రోత్సహించి, ఇప్పుడు ఐక్యత గురించి మోడీ మాట్లాడటం విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య విభేదాలు పెంచిన తర్వాత కూడా దేశం ఒకటిగా నిలవాలని పిలుపునివ్వడం నమ్మశక్యం కాదని కిషోర్ ప్రశ్నించారు.
ఇదే వేదికగా కిషోర్ మాట్లాడుతూ.. “మీకు అసలు సిగ్గు ఉందా? మీ రాజీలు, లొంగుబాట్ల కారణంగా ఇంకా ఎన్ని సవాళ్లు ఎదుర్కోవాలి? మీ తప్పిదాలు, వాటిని దాచిపెట్టే ప్రయత్నాల కోసం ఇంకా ఎంత మూల్యం చెల్లించాలి? యుద్ధ నేరస్తులను సమర్థిస్తున్నానని చెప్పుతూ, మీరు వెళ్లి వారిని ఆలింగనం చేసుకునే ముందు మమ్మల్ని అడిగారా?” అని మోడీని నటుడు కిషోర్ ప్రశ్నించారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి.
ఇదే క్రమంలోను ప్రభుత్వ నిర్ణయాలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరైన ప్రణాళిక లేకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పటికే దేశానికి సమస్యలను తెచ్చిపెట్టాయని అన్నారు. ఇలాంటి విధానాల వల్ల భవిష్యత్తులో దేశం పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని నటుడు కిషోర్ హెచ్చరించారు.
ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు
ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను కూడా ఆయన ప్రశ్నించారు.
డీమోనిటైజేషన్
కరోనా లాక్‌డౌన్
వ్యవసాయ చట్టాలు
అగ్నివీర్ పథకం
వంటి అంశాల్లో ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ నిర్ణయాల వల్ల దేశం ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటోందని నటుడు కిషోర్ అన్నారు.
ప్రజలపై ప్రభావం
ప్రభుత్వ విధానాల వల్ల సాధారణ ప్రజలు పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తోందని కిషోర్ అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో జరిగిన పరిస్థితులను ఉదాహరణగా చూపుతూ, ప్రజల ప్రాణాలకు సరైన విలువ ఇవ్వలేదని విమర్శించారు.
కిషోర్ తన పోస్టులో మోడీపై సంధించిన ప్రశ్నలు:
- “కలిసి ఉండాలా? ఒక దేశంగా??
- ముందుగా మనల్ని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అని విభజించి ద్వేషాన్ని రెచ్చగొట్టి, మళ్లీ ఒక్కటిగా ఉండమంటారా?
- మీకు అసలు సిగ్గు ఉందా?..
- మీ రాజీలు, లొంగుబాట్ల కారణంగా ఇంకా ఎన్ని సవాళ్లు ఎదుర్కోవాలి?
- మీ తప్పిదాలు, వాటిని దాచిపెట్టే ప్రయత్నాల కోసం ఇంకా ఎంత మూల్యం చెల్లించాలి?
- యుద్ధ నేరస్తులను సమర్థిస్తున్నానని చెప్పుతూ, మీరు వెళ్లి వారిని ఆలింగనం చేసుకునే ముందు మమ్మల్ని అడిగారా?
- అటువంటి నిర్ణయాలపై ప్రతిపక్షాన్ని, మా తరఫున పనిచేసే అధికారులను లేదా మమ్మల్ని అడిగారా?
- రాఫెల్ ఒప్పందం నుంచి ఎప్స్టీన్ వరకు, డీమోనిటైజేషన్ నుంచి కరోనా లాక్‌డౌన్ వరకు, వ్యవసాయ చట్టాలు నుంచి అగ్నివీర్ వరకు, మణిపూర్ నుంచి కాశ్మీర్ లేదా లడఖ్ వరకు.. ఈ నిర్ణయాల ముందు ఎవరినైనా సంప్రదించారా?
- మీ రాజీలు, లొంగుబాట్లు, తప్పిదాల వల్ల వచ్చిన సమస్యలను ఎదుర్కొమని ఇప్పుడు మమ్మల్ని అడగడానికి మీకు ఏమి హక్కు ఉంది?
ఇక చాలు...మేము గొర్రెల మందలా మరణించడానికి సిద్ధంగా లేము, కరోనా సమయంలో జరిగినట్లుగా. మా కోట్లాది ప్రాణాలు మీ దృష్టిలో విలువలేనివిగా మారాయి. ఇప్పుడు మీ నియంతృత్వ ధోరణి ముగిసే సమయం వచ్చింది.. దేశ అత్యున్నత పదవిని అవమానపరిచిన ఈ వ్యవహారం ఇక కొనసాగకూడదు.”అ ని కిషోర్ ప్రశ్నించారు
సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన
అయితే, కిషోర్ సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో ఎక్కువ మందిని ఆలోచింపజేస్తున్నాయి. ఇదే సమయంలోనూ మిశ్రమ స్పందనలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన అభిప్రాయానికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు. దీంతో ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయి.
కిషోర్ తన పోస్టులో దేశంలో మతపరమైన విభజనలను ప్రోత్సహించిన తర్వాత ఐక్యత గురించి మాట్లాడటం విరుద్ధమని విమర్శించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య విభేదాలు పెరిగిన పరిస్థితుల్లో “ఒక దేశంగా నిలుద్దాం” అనే పిలుపు నమ్మశక్యం కాదని వ్యాఖ్యానించారు.
