Kantara: Chapter 1 Box Office: కాంతారా చాప్టర్ 1 కలెక్షన్ల మోత.. 12 రోజుల్లో గ్రాస్, నెట్ ఎంతంటే?

Kantara: Chapter 1 Box Office: కాంతారా చాప్టర్ 1 కలెక్షన్ల మోత.. 12 రోజుల్లో గ్రాస్, నెట్ ఎంతంటే?

రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన కాంతారా చాప్టర్ 1 వసూళ్లలో దుమ్మురేపుతోంది. అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ, రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది. 11వ రోజైన ఆదివారం (అక్టోబర్ 12న) రూ.39.75 కోట్లు సాధించగా, 12వ రోజైన సోమవారం (అక్టోబర్ 14న) రూ.13.50 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్లు వసూలు చేసింది.

ఈ క్రమంలో కాంతారా చాప్టర్ 1.. ఓవరాల్ 12 రోజుల వసూళ్లను కలిపి చూస్తే.. ఇండియాలో రూ.451.90 కోట్ల నెట్ వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్గా రూ.675 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లతో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కాంతారా చాప్టర్1 పలు ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాల నెట్ వసూళ్లను బీట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 

కాంతారా చాప్టర్ 1 రికార్డులు:

రజనీకాంత్ జైలర్ (రూ.348.55 కోట్ల నెట్), బాహుబలి: ది బిగినింగ్ (రూ. 421 కోట్ల నెట్), సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్ (రూ.406 కోట్లు) మరియు సయ్యారా (రూ.329 కోట్లు) వంటి ఇండియా బ్లాక్‌బస్టర్‌ సినిమాలను అధిగమించగలిగింది. అయితే కాంతారా చాప్టర్ 1, విక్కీ కౌశల్ నటించిన బాలీవుడ్ మూవీ ఛావా (రూ.601.54 కోట్ల నెట్) కలెక్షన్స్ను బీట్ చేయడానికి దగ్గరలో ఉంది.

ప్రస్తుతం 2025లో అత్యధిక లైఫ్ టైం వసూళ్లు (రూ.808 కోట్ల గ్రాస్) చేసిన భారతీయ చిత్రంగా ఛావా ఉంది. కాంతారా చాప్టర్ 1, మొత్తం 12వ రోజు నాటికి రూ.675 కోట్ల గ్రాస్ వసూళ్లతో రెండో స్థానంలో ఉంది. ఓవర్సీస్ లోను దూకుడుగా వెళ్తుంది. నార్త్ అమెరికాలో రికార్డ్ కలెక్షన్స్తో కొనసాగుతోంది. ఇక ఈ వసూళ్ల సునామి ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

కాంతారా చాప్టర్ 1' రోజు వారీగా బాక్సాఫీస్ కలెక్షన్:

మొదటి రోజు (Oct 2 గురువారం)- రూ. 61.85 కోట్లు
రెండవ రోజు (శుక్రవారం)- రూ. 45.40 కోట్లు
3వ రోజు (శనివారం)- రూ. 55.00 కోట్లు
4వ రోజు (ఆదివారం)- రూ. 63.00 కోట్లు
5వ రోజు (సోమవారం)- రూ. 31.50 కోట్లు
6వ రోజు (మంగళవారం)- రూ. 34.25 కోట్లు
7వ రోజు (బుధవారం)- రూ. 25.25 కోట్లు
8వ రోజు (గురువారం)- రూ. 21.15 కోట్లు

వారం 1 మొత్తం= రూ. 337.40 కోట్లు

9వ రోజు (2వ శుక్రవారం)- రూ. 22.00 కోట్లు
10వ రోజు (2వ శనివారం)- రూ. 39 కోట్లు
11వ రోజు (2వ ఆదివారం)- రూ. 39 కోట్లు
12వ రోజు (13th Oct 2వ సోమవారం)- రూ. 13.50 కోట్లు 
మొత్తం= రూ. 451.90 కోట్లు