Jr NTR : 'కాంతార: చాప్టర్ 1' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌: గెస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వేడుక ఎక్కడంటే?

Jr NTR : 'కాంతార: చాప్టర్ 1' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌:  గెస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వేడుక ఎక్కడంటే?

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా అపారమైన కీర్తిని తీసుకొచ్చిన చిత్రం 'కాంతార'. ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడమే కాకుండా, భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. పౌరాణిక అంశాలు, భూతకోల సంస్కృతిని మేళవించి తీసిన ఈ చిత్రం ఒక సంచలనంగా నిలచింది. ఇప్పుడు, ఆ అద్భుతమైన కథకు పునాదిగా, దాని మూలాలను ఆవిష్కరించే 'కాంతార: చాప్టర్ 1' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరాయి. 

దసరా పండుగ సందర్భంగా,  సినీ ప్రియులకు అతిపెద్ద కానుకగా..  అక్టోబర్ 2వ తేదీన 'కాంతార: చాప్టర్ 1' ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, సినిమా బృందం తమ ప్రచార కార్యక్రమాలలో  మరింత దూకుడు పెంచింది. ఈ ప్రమోషన్లలో భాగంగా మూవీ మేకర్స్ సినిమా విడుదలకు ముందు జరిగే 'ప్రీ-రిలీజ్ వేడుక' గురించి ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు.

►ALSO READ | Akkineni Nagarjuna: నాకిప్పుడు ఇద్దరు కూతుళ్లు.. కొత్త కుంటుంబంపై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు.!

'కాంతార: చాప్టర్ 1' ప్రీ-రిలీజ్ వేడుకకు జూ. ఎన్టీఆర్

ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 28న హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా, భారీ స్థాయిలో నిర్వహించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు రాబోతున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది.  లేటెస్ట్ గా సినీ వర్గాలను, అభిమానులను ఉర్రూతలూగించే ఒక అసాధారణ ప్రకటన మూవీ మేకర్స్ నుంచి వచ్చింది. ఇంకెవరో కాదు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరుకానున్నారని వెల్లడించింది. ఆయన రాకతోఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ తీసుకురానుంది. అంతే కాదు ఈ సినిమా 'బజ్' కు మరింతగా దోహదపడుతుందని భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రెజెన్స్ 'కాంతార: చాప్టర్ 1' ప్రచారానికి ఒక పెద్ద బూస్ట్‌ని ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

 రిషబ్ శెట్టి నటనా విశ్వరూపం

మరోవైపు, ఇటీవల  విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషల్లోనూ విశేష స్పందన అందుకుంది. రిషబ్ శెట్టి నటనా విశ్వరూపం, అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరితమైన కథాంశం ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ప్రేక్షకుల్లో అంచనాలను, ఉత్సాహాన్ని ఈ ట్రైలర్ మరింత పెంచింది. ముఖ్యంగా ట్రైలర్ చివరిలో వచ్చే ఎలివేషన్ షాట్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలయ్యాయి. బెంగళూరులో టికెట్ విక్రయాలు ప్రారంభం కాగానే, అభిమానులు తమ సీట్లను దక్కించుకునేందుకు ఎగబడ్డారు.  హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి 

7,000కు పైగా స్క్రీన్‌లపై రిలీజ్..

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 7 భాషల్లో 7,000కు పైగా స్క్రీన్‌లలో విడుదలవుతోంది. అక్టోబర్ 1న 2,500లకు పైగా థియేటర్లలో  ప్రీమియర్‌ షోలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్ , గీతా ఆర్ట్స్ పంపిణీ బాధ్యతలు చేపట్టాయి.   రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపు రూ.100 కోట్ల భారీ డీల్‌తో ఈ రైట్స్‌ అమ్ముడవడం ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ని స్పష్టం చేస్తున్నాయి. తొలుత కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. 

'కాంతార' విజయం తరువాత, 'కాంతార: చాప్టర్ 1' ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలని సినీ ప్రేక్షకులు, విమర్శకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు ఈ పౌరాణిక, యాక్షన్ చిత్రం సిద్ధమవుతోంది. మరి సెప్టెంబర్ 28న జరగబోయే ఈ అద్భుత వేడుక, అలాగే అక్టోబర్ 2న సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో వేచి చూడాలి!