Akkineni Nagarjuna: నాకిప్పుడు ఇద్దరు కూతుళ్లు.. కొత్త కుంటుంబంపై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు.!

Akkineni Nagarjuna: నాకిప్పుడు ఇద్దరు కూతుళ్లు.. కొత్త కుంటుంబంపై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు.!

అక్కినేని అభిమానులకు ఈ సంవత్సరం పండుగలాంటిది. కారణం, కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో 40 ఏళ్ల మైలురాయిని చేరుకోబోతున్నారు. అంతే కాదు వారి కుటుంబ ప్రతిష్టాత్మక సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాల ఘన వారసత్వాన్ని పూర్తి చేసుకుంది. తన 100 వ చిత్రానికి రెడీ అవుతున్నారు. నవంబర్ 14న 'శివ' మూవీ రీ రిలీజ్ అవుతోంది. కనుక ఈ ఏడాది అక్కినేని కుటుంబానికి, అభిమానలకు నిజంగా ఒక ప్రత్యేకమైనది నిలుస్తోంది. ఈ సందర్భంగా నాగార్జున తన కెరీర్, కుటుంబం, స్టూడియో గురించి ఇటీవల  ఓ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

 గందరగోళంగా నంబర్ గేమ్..

శివ, క్రిమినల్ వంటి చిత్రాలతో హిందీ ప్రేక్షకులను, అలాగే మనం, సంతోషం, నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య వంటి హిట్‌లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున తన 40 ఏళ్ల ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ రోజుల్లో నా దారిలోకి వచ్చిన దాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. ఒకప్పుడు, యువకుడిగా ఉన్నప్పుడు నంబర్స్, అగ్రస్థానం గురించి ఒత్తిడి ఉండేది. కానీ అది క్రమంగా తగ్గిపోయింది. ఇప్పుడు నంబర్ గేమ్ ప్రతీ నెలా మారిపోతోంది, అది గందరగోళంగా తయారైందన్నారు. 40 ఏళ్ల తర్వాత కూడా నాకు నచ్చిన పని చేయలేకపోతే ఇక ప్రయోజనం ఏముంది? అని నాగార్జున అన్నారు.

టెక్నాలజీతో పాటు అడుగులు..

క్యాసెట్‌ల నుంచి డీవీడీలు, పెన్‌డ్రైవ్‌ల నుంచి ఇప్పుడు ఫోన్లలో సినిమాలు చూసే స్థాయికి వచ్చాం... ఈ మార్పును నేను ఆస్వాదిస్తున్నానని నాగార్జున చెప్పారు. నేను పాతకాలపు మనిషిని కాదు. టెక్నాలజీకి అనుగుణంగా మారాలి.  ఒకవేళ నేను అలాగే ఉంటే ముందుకు వెళ్లలేము. టెక్నాలజీతో పాటు అడుగులు వేయడానికి నేను ఇష్టపడతాను అని నాగార్జున తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

 వారసత్వాన్ని మోస్తున్న మూడో తరం

తన తండ్రి, దివంగత అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ ప్రయాణం గురించి నాగార్జున మాట్లాడుతూ..  స్టూడియో మొదటి 30 ఏళ్లు నిజంగా ఒక పోరాటం అని చెప్పారు.. స్టూడియో ఓనర్ అని చెప్పుకోవడం బాగుంటుంది కానీ, దాన్ని నడిపించడం చాలా కష్టం. సినిమాలు తనకు అన్నీ ఇచ్చాయని, సినిమా ప్రపంచానికి తిరిగి ఇవ్వాలనుకునేవారు నాన్న. ఆ బాధ్యతను నాపై, నా సోదరుడిపై పెట్టారు అని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మూడో తరం నాగ చైతన్య, అఖిల్ ఈ బాధ్యతను స్వీకరించడం నాకు సంతోషంగా ఉంది. వారు కొత్త టెక్నాలజీలను చూస్తున్నారు. వారు దీన్ని ఆస్వాదిస్తున్నారని ఆశిస్తున్నాను. లేదంటే ఇది నిజమైన పోరాటమే అవుతుంది అని నాగార్జున అన్నారు.

►ALSO READ | OTT Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి మిస్టరీ థ్రిల్లర్ సిరీస్.. మాస్క్తో భయపెట్టే కిల్లర్.. ఇంట్రెస్టింగ్గా ట్రైలర్

మా ఇంట్లో ఇద్దరు కూతుళ్లు

నటుడు నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ గురించి నాగార్జున ఆసక్తికర విషయాలు పంచుకున్కనారు . శోభిత మా కుంటుంలో అద్భుతంగా ఉంటుంది. అందిరితో కలిసిపోతుంది. మా ఇంట్లో కూతురు ఉన్నట్టే ఉంది. మాకిప్పుడు ఇద్దరు కూతుళ్లు. జైనాబ్ (అఖిల్ భార్య),  శోభిత ( నాగచైతన్య భార్య ) అని నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. కోడలితో తన బంధం గురించి వివరిస్తూ.. మేమిద్దరం పుస్తకాలు సంగీతం గురించి మాట్లాడుకుంటాం. ప్రస్తుతం, ఆమె చైతూ ఇంట్లో ఒక గార్డెన్ పెంచాలని అనుకుంటోంది. నాకు కూడా గార్డెనింగ్‌పై చాలా ఆసక్తి ఉంది, అందుకే దాని గురించి చాలా మాట్లాడుకుంటాం. మాది చాలా చక్కటి అనుబంధం అని కింగ్ తెలిపారు.

ఫిట్‌నెస్ రహస్యం

నాగార్జునకు 66 సంవత్సరాలు వచ్చినా ఇంకా యంగ్ గా, ఫిట్ నెస్ గా కనిస్తారు. ఈ గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తుంటారు అని ఆయనను చాలామంది అడుగుతుంటారు కూడా. ఈ సందర్భంగా తన ఫిట్ నెస్ ను కూడా బయటపెట్టారు కింగ్. నేను నా కొడుకులకు ఫిట్‌నెస్ టిప్స్ ఇస్తాను అని చెప్పుకోచ్చారు.  తాను రోజూ ఒక గంట ఫిట్‌నెస్ కోసం కేటాయిస్తానని, ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండటానికి బ్యాలెన్స్‌డ్ డైట్ పాటిస్తానని తెలిపారు. నాగ చైతన్య, అఖిల్ తనతో కలిసి వర్కౌట్ చేస్తారని, కానీ తాను వారితో పోటీ పడలేనని తెలిపారు.  సినీ ప్రపంచంలో తన ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నట్లు కింగ్ చెప్పారు..