
శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్‌లో రాజేష్ ఎం. సెల్వా దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్’. నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది. దసరా సందర్భంగా అక్టోబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కి రానుంది. ఈ క్రమంలో గురువారం (సెప్టెంబర్ 25న) ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
కపుల్స్ అయిన కావ్య రాజారామ్, అనూప్ ఓ గేమింగ్ కంపెనీలో డిజైనర్స్‌గా వర్క్ చేస్తుంటారు. వీళ్లు డిజైన్ చేసిన ‘మాస్క్ మేయమ్’ గేమ్‌కు హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో పాటు బెస్ట్ గేమింగ్ డిజైనర్‌గా కావ్యకు అవార్డ్ వస్తుంది. కానీ అదే మాస్క్ వేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి కావ్యపై దాడి చేస్తాడు. దీనిపై పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది.
మరోవైపు సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ చేస్తుంటారు. తనకు తెలిసిన వాళ్లే ఇదంతా చేస్తున్నారని ఆమె అనిమానిస్తుంటుంది. ఇంతకూ మా మాస్క్ వెనకున్నది ఎవరు.. అతని నుంచి ఎలా తప్పించుకుంది అనేది మిగతా కథ.
►ALSO READ | Alia Bhatt: హీరోయిన్ అలియా భట్ ఫొటోస్, వీడియోస్ ట్రోల్.. అసలు కారణమిదే!
ట్రైలర్ రిలీజ్ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ ‘నాకిదే ఫస్ట్ ఓటీటీ సిరీస్. ఇందులో ఇండిపెండెంట్ ఉమెన్‌గా కనిపిస్తా. తను సృష్టించిన పాత్ర తనకు వ్యతిరేకంగా మారితే ఎలా ఉంటుందనేది కాన్సెప్ట్. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పింది.
దర్శకుడు రాజేష్ ఎం.సెల్వా మాట్లాడుతూ ‘ఇదొక ఫ్యామిలీ డ్రామా. అలాగే కాంప్లికేటెడ్ రిలేషన్స్‌తో కూడిన థ్రిల్లర్. ఈ హైపర్-కనెక్టెడ్ యుగంలో ఏదీ కేవలం వర్చువల్‌గా మిగలదు. తెరపై జరిగే విషయం వాస్తవంలోకి చొచ్చుకొస్తుంది, నియంత్రించలేని పరిణామాలతో. ప్రతి మాస్క్ వెనుక ఒక సత్యం దాగి ఉంటుంది అనేది ఇందులో చూపిస్తున్నాం’ అని చెప్పాడు. ఈ సిరీస్ కి దీప్తి గోవిందరాజన్ కథ అందించారు.