
మూడేళ్ళ కిందట పెద్దగా అంచనాలేమీ లేకుండా విడుదలై... పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు సృష్టించిన సినిమా కాంతార. రూ. 14 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ కన్నడ సినిమా ఏకంగా నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసి.. కేజిఎఫ్ తర్వాత ఆ రేంజ్ విధ్వంసం సృష్టించి.. దేశం మొత్తం కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది. బాక్సాఫీస్ డాగర కలెక్షన్ల సునామి సృష్టించిన ఈ సినిమా ప్రీక్వెల్ గా.. రిషబ్ డైరెక్షన్లో రూపొందిన కాంతార చాప్టర్ 1 గురువారం ( అక్టోబర్ 2 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి, ఈ మైథలాజికల్ థ్రిల్లర్ ఫస్ట్ పార్ట్ రేంజ్ లో అలరించిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం...
కథ:
కాంతార ఫస్ట్ పార్ట్ లో హీరో తండ్రి ఎలా మాయమయ్యాడు అనేది పెద్ద సస్పెన్స్.. కాంతార చాప్టర్ 1 ఈ పాయింట్ చుట్టూ నడుస్తుంది. హీరో తండ్రి కథ ఏంటి.. ఎందుకు మాయమైపోయాడు ? అందుకు దారి తీసిన పరిణామాలేంటి అన్నదే ఈ సినిమా కథ. ప్రధానంగా మూడు తెగల చుట్టూ నడుస్తుంది ఈ సినిమా కథ. మూడు తెగలకు పింజర్ల దేవుడు కావాలని అనుకుంటారు. కాంతార తెగ తమ దేవుడిని కాపాడుకుంటూ ఉంటారు. కాంతార తెగ దేవుడికి కాపరి పాత్రలో రిషబ్ శెట్టి నటించాడు.
మరో తెగ బంగ్రా రాజు విజయేంద్ర పాత్రలో జయరాం నటించాడు. యువరాజు కులశేఖర్ గా గుల్షన్ దేవయ్య, యువరాణి కనకవతి పాత్రలో రుక్మిణి వసంత్ నటించారు. కాంతార తెగ దగ్గర ఉన్న పింజర్ల దేవుడి కోసం బంగ్రా తెగ, కడపటి దిక్కు తెగలు ప్రయత్నిస్తుంటాయి.. ఇరు తెగల నుంచి తమ దేవుడు పింజర్లను రిషబ్ శెట్టి ఎలా కాపాడాడు అనేదే కథ. ఈ పోరాటంలో కాంతారకు తెగకు ఎదురైన ఇబ్బందులు ఏంటి.. తమ దేవుడిని కాంతార తెగ ఎలా కాపాడుకుంది అన్నది థియేటర్లో చూడాలి.
విశ్లేషణ:
కాంతార ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో చాప్టర్ 1 పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను రీచ్ అవ్వడం రిషబ్ శెట్టికి అటు డైరెక్టర్ గా, హీరోగా పెద్ద సవాల్ గా మారిందనే చెప్పాలి. అయితే.. రిషబ్ శెట్టి ప్రేక్షకుడిని మెప్పించడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఫస్ట్ పార్ట్ లో క్లైమాక్స్ లో వచ్చే హై ఇచ్చే ఎలిమెంట్స్ ఈ సినిమా సెకండాఫ్ మొత్తం పుష్కలంగా ఉన్నాయనే చెప్పాలి. ఈ విషయంలో మాత్రం రిషబ్ శెట్టి ప్రేక్షకుల అంచనాలను వంద శాతం అందుకున్నాడు.
సినిమా ప్రథమార్థం మొత్తం పాత్రల పరిచయానికి, కథను ఎస్టాబ్లిష్ చేయడానికి వాడుకున్న దర్శకుడు.. ఇంటర్వెల్ బ్యాంగ్ తో ప్రేక్షకుడి కావాల్సిన హై మూమెంట్ ఇచ్చాడు.అక్కడ స్పీడ్ అందుకున్న కథ ఇక ద్వితీయార్థం అంతా అదే స్పీడ్ తో సాగుతుంది. ప్రేక్షకుడు ఆశించిన హై మూమెంట్స్, ట్విస్ట్ లతో సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది.
అయితే..డబ్బింగ్ విషయంలో సినిమా యూనిట్ ఇంకొంచెం కేర్ తీసుకొని బాగుండేదని అనిపించింది. తెగలు, పాత్రల పేర్లు కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మర్చి ఉంటే తెలుగు ఆడియెన్స్ కి మరింత కనెక్ట్ అయ్యేది. అక్కడక్కడా కొన్ని సినిమాలకు సంబందించిన ఛాయలు కనిపించినా అవేవి ప్రేక్షకుడిపై ప్రభావం చూపవు.
హీరోగా డైరెక్టర్ గా రిషబ్ శెట్టి మరోసారి సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.. ఆ రేంజ్ లో ఉంది అతని నటన. హీరోయిన్ రుక్మిణి వసంత్ కూడా రిషబ్ శెట్టికి ఏమాత్రం తగ్గకుండా నటించి తన సత్తా చాటింది. ఇక జయరాం, గుల్షన్ దేవయ్య తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఈ సినిమా టెక్నీకల్ గా కూడా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్రథమార్థంలో కొంచెం ల్యాగ్ ఫీల్ అయ్యే సీన్లు మినహా ఈ సినిమాలో పెద్దగా మైనస్ లు లేవు
ప్లస్ పాయింట్స్:
- రిషబ్ శెట్టి యాక్టింగ్, డైరెక్షన్.
- మ్యూజిక్,
- వీఎఫెక్స్,
- క్లైమాక్స్.
మైనస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా ల్యాగ్