విడాకుల దిశగా హాలీవుడ్ జంట.. భరణంగా రూ.1.6 కోటి

విడాకుల దిశగా హాలీవుడ్ జంట.. భరణంగా రూ.1.6 కోటి

ఇటీవలి కాలంలో విడాకులు అత్యంత సాధారణ విషయంగా మారాయి. ఇక సినీ ఇండస్ట్రీలో అయితే... ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇదే. తాజాగా మరో హాలీవుడ్ జంట కూడా అదే జాబితాలోకి చేరింది. వాళ్లే కిమ్ కర్దాషియాన్, కాన్వే వెస్ట్. వీరి విడాకులకు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయంపై ప్రస్తుతం క్లారిటీ వచ్చింది. వీరి నలుగురు పిల్లల బాధ్యతను దంపతులిద్దరూ ఉమ్మడిగా స్వీకరించినట్టు తెలుస్తోంది. అయితే కాన్యే నెలకు 2లక్షల డాలర్లను అంటే దాదాపుగా రూ.1.6కోటిని తమ పిల్లల సంరక్షణకు గానూ అందించనున్నట్టు సమాచారం. అంటే పిల్లల చదువులు, ఫుడ్, సెక్యూరిటీ వంటి ఖర్చులన్నీ ఇందులో వస్తాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఇక వీరిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కర్దాషియాన్, వెస్ట్ ల నలుగురు పిల్లలలో ఒకరి గురించి ఎప్పుడైనా విబేధిస్తే... అవతలివారు తప్పనిసరిగా మధ్యవర్తిత్వానికి వెళ్లాలి. ఒకవేళ మధ్యవర్తిత్వానికి హాజరు కాకపోతే, ఆ కమిటీ నిర్ణయాన్నే అంగీకరించాలి. ఇక వీరి ఆస్తులన్నీ వారి ముందస్తు ఒప్పందంతో సమానంగా విభజించబడినట్టు సమాచారం. కిమ్, కాన్యేతో 2011లో డేటింగ్ ప్రారంభించగా... 2013లో వారికి ఓ కుమార్తె పుట్టింది. 2014లో వారు పెళ్లి చేసుకున్నారు.  అనంతరం 7 సంవత్సరాల తర్వాత అంటే 2021లో వారు విడాకులకు అప్లై చేశారు.