
ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ విషయంలో బాలీవుడ్ ముందుంది. గంగూబాయ్, నంబి నారాయణన్, మిథాలీ రాజ్, ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్‌షా, ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ వంటి ఎంతోమంది జీవితాలు అక్కడ తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ప్రముఖ స్టాండప్ కమెడియన్ కపిల్‌శర్మ బయోపిక్‌ను అనౌన్స్ చేశారు. పంజాబ్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్‌కి కొడుకుగా పుట్టి, ఎన్నో కష్టాల మధ్య పెరిగాడు కపిల్. ముంబై వచ్చి స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు. కామెడీ నైట్స్ విత్ కపిల్, ద కపిల్ శర్మ షో లాంటి ప్రోగ్రామ్స్‌తో స్టార్ కమెడియన్ అయ్యాడు. ఎంత పెద్ద సినిమా అయినా ప్రమోషన్ కోసం అతని షోకి వెళ్లాల్సిందే. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ కూడా వెళ్లింది. ఇక 2016, 2017 ఫోర్బ్స్ లిస్ట్‌లో స్థానం కూడా సంపాదించాడు కపిల్. సినిమాల్లో నటిస్తున్నాడు, నిర్మిస్తున్నాడు. అందుకే కపిల్ జీవితాన్ని ‘ఫన్‌కార్’ పేరుతో సినిమాగా తీస్తున్నాడు మృగదీప్ సింగ్ లాంబా. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మహావీర్ జైన్ నిర్మిస్తున్నారు. తన పాత్రలో కపిలే నటిస్తాడో లేక మరెవరినైనా తీసుకుంటారో చూడాలి.