2 వేలు లంచం తీసుకున్నవీఆర్వోకు రెండేళ్లు జైలు

2 వేలు లంచం తీసుకున్నవీఆర్వోకు రెండేళ్లు జైలు

కరీంనగర్ టౌన్, వెలుగు: పట్టాదారు పాస్​బుక్​ కోసం రూ.2వేలు లంచం తీసుకున్న కేసులో వీఆర్వోకు కరీంనగర్​ఏసీబీ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఉమ్మడి కరీంనగర్ ​జిల్లాలోని మహాముత్తారం మండలానికి చెందిన లింగమల్ల వెంకట్రాజం ​భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామంలో1.38 ఎకరాల  స్థలం కొన్నాడు. పట్టాదారు పాస్​బుక్​కోసం భూపాలపల్లి మండలం తహసీల్దార్ కు 2008 జూన్ 21న దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తహసీల్దార్ విచారణ  కోసం దరఖాస్తును వీఆర్వో జూపాక మొగిలికి పంపించారు. రూ.10వేలు లంచం ఇస్తేనే పాస్ బుక్ ఇప్పిస్తానని వీఆర్వో మొగిలి డిమాండ్ ​చేయగా, రూ.9 వేలు ఇస్తానని ఒప్పుకుని వెంకట్రాజం ​నవంబర్ 6న కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మరుసటిరోజు వెంకట్రాజం.. మొగిలి ఇంటికి వెళ్లి రూ.2వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ జనార్దన్ తన టీమ్​తో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అప్పటి సీఐ సాంబయ్య కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ షీట్​దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పి.లక్ష్మికుమారి వీఆర్వో మొగిలికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు, రూ.20వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు. మొగిలి ప్రస్తుతం భూపాలపల్లి ఫారెస్ట్ ఆఫీస్​లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు.