దివ్యాంగులకు సేవ చేయడం అభినందనీయం : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి

దివ్యాంగులకు సేవ చేయడం అభినందనీయం : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి
  • కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి

తిమ్మాపూర్, వెలుగు: స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సేవ చేయడం అభినందనీయమని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. రూ. 26 లక్షలతో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ బస్సును అందజేయగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రస్ట్ సభ్యులు మానసిక వికలాంగుల పాఠశాల, వృత్తివిద్యా కేంద్రాన్ని స్థాపించి నిర్విరామంగా దశాబ్దాలపాటు సేవ చేయడం గొప్ప విషయమన్నారు.

ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్​ జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు కలెక్టర్ తిమ్మాపూర్ పీహెచ్‌‌‌‌సీని సందర్శించారు. కార్యక్రమంలో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ డీజీఎం సీహెచ్ వెంకట రెడ్డి, బోర్డు డైరెక్టర్ తిరుమల, ట్రస్ట్ వ్యవస్థాపకుడు బి.వెంకటయ్య, డీఎంహెచ్‌‌‌‌వో వెంకటరమణ, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలి

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని  కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈనెల 27 నుంచి నవంబర్2 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌‌‌‌లో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి పనిలో జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ హెల్ప్ లైన్ నెంబర్ 14432 లోగో పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, విజిలెన్స్ ఎన్‌‌‌‌ఫోర్స్ మెంట్ ఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఆర్డీవో మహేశ్వర్, జడ్పీ సీఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.