కేబుల్​ బ్రిడ్జి, ఎల్ఎండీపైకి నో పర్మిషన్​​

కేబుల్​ బ్రిడ్జి, ఎల్ఎండీపైకి నో పర్మిషన్​​
  •      సీపీ  అభిషేక్ మహంతి

కరీంనగర్ క్రైం, వెలుగు: 31న సాయంత్రం 6గంటల నుంచి జనవరి 1 సాయంత్రం 6 గంటల వరకు కేబుల్ బ్రిడ్జి, ఎల్ఎండీపైకి వెళ్లేందుకు పర్మిషన్​లేదని కరీంనగర్​సీపీ అభిషేక్​మహంతి స్పష్టం చేశారు. కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లో పరిధిలో డిసెంబర్ 31, కొత్త ఏడాది వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. రోడ్లపై వేడుకలు, డీజేలు, బైక్ సైలెన్సర్లను మార్చి శబ్దకాలుష్యం చేస్తూ తిరగడం, ట్రిపుల్ రైడింగ్‌‌‌‌‌‌‌‌.. అనుమతి లేదని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

జగిత్యాల టౌన్, వెలుగు: సంతోషాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలని జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించే వేడుకలకు నిర్వాహకులు పోలీసుల నుంచి పర్మిషన్​తీసుకోవాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. 
 

హద్దు మీరితే చర్యలు తప్పవు
 

గోదావరిఖని, వెలుగు : డిసెంబర్ 31 వీడ్కోలు, న్యూ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆహ్వానిస్తూ చేసుకునే వేడుకలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, హద్దు మీరితే చర్యలు తప్పవని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి హెచ్చరించారు. శనివారం సీపీ మీడియాతో మాట్లాడుతూ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో 31న రాత్రి 10 గంటల నుంచి పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తామని, పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి బైండోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని సీపీ హెచ్చరించారు. న్యూఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేడుకలను అర్ధరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాలని సూచించారు.