
- ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తి.. మరికొన్ని నేడు ప్రారంభం
- కొత్త బిల్డింగ్‌ల కోసం ఫండ్స్ రిలీజ్ చేసిన సర్కార్
కరీంనగర్, వెలుగు: జిల్లాలో సొంత భవనాలు లేని, శిథిలావస్థలో ఉన్న గ్రామపంచాయతీలు, అంగన్ వాడీ కేంద్రాలకు కొత్త బిల్డింగ్స్ నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో కరీంనగర్ జిల్లాకు 56 పంచాయతీలకు, 46 అంగన్ వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరయ్యాయి.
ఒక్కో జీపీ బిల్డింగ్ కు రూ.20 లక్షల చొప్పున రూ.11.20కోట్లు కేటాయించారు. ఇందులో 37 జీపీ భవనాల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా.. మరో 19 నిర్మాణానికి శుక్రవారం పనుల జాతర --2025 పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు శంకుస్థాపన చేయబోతున్నారు. 41 అంగన్‌వాడీలకు ఒక్కో భవనానికి రూ.12 లక్షల చొప్పున రూ.5.64 కోట్లు కేటాయించారు.
కొత్త బిల్డింగ్స్ మంజూరైంది ఈ జీపీలకే..
కొత్త బిల్డింగ్స్ మంజూరైన జీపీల్లో చిగురుమామిడి మండలం కొండాపూర్, ఉల్లంపల్లి, చొప్పదండి మండలం చాకుంట, గుమ్లాపూర్, కంటేపల్లి, కుర్మపల్లి, వెదురుగట్ట, ఇల్లంతకుంట మండలం బుజునూరు, కనగర్తి, గంగాధర మండలం చర్లపల్లి(ఆర్), చిన్నఅచ్చంపల్లి, గర్శకుర్తి, ఇస్లాంపూర్, నర్సింహులపల్లి, తాడిజెర్రి, గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి, యాస్వాడ, హుజూరాబాద్ మండలం అంబేద్కర్‌నగర్, పోతిరెడ్డిపేట, రాంపూర్, జమ్మికుంట మండలం అంకుషాపూర్, నగురం, సైదాబాద్, వావిలాల, విలాసాగర్, కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల, జూబ్లీ నగర్ ఉన్నాయి.
కొత్తపల్లి మండలం అసిఫ్ నగర్, మానకొండూరు మండలం బంజెరుపల్లి, ఈదులగట్టుపల్లి, గట్టుదుద్దెనపల్లి, కల్లెడ, నిజాయితీగూడెం, పెద్దూరుపల్లి(గొల్లపల్లి), రాఘవాపూర్, శంషాబాద్, రామడుగు మండలం చిప్పకుర్తి, దేశారాజుపల్లి, గోపాల్ రావుపేట, రుద్రారం, వన్నారం, వెదిర, సైదాపూర్ మండలం ఆకునూరు, దుద్దెనపల్లి, గొడిశాల, లంబాడీ తండా, లస్మనపల్లి, సోమారం, వెంకటేశ్వర్లపల్లి, తిమ్మాపూర్ మండలం బలాయిపల్లి, ముక్తపల్లి, నర్సింగాపూర్, వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి జీపీలకు కొత్త బిల్డింగ్స్ మంజూరయ్యాయి. కేశవపట్నం మండలం గొల్లపల్లికి మంజూరైన జీపీ బిల్డింగ్ ఇప్పటికే పూర్తి కాగా, మరో జీపీ రాజాపూర్‌లో బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.
41 అంగన్‌వాడీలకు సొంత భవనాలు
చిగురుమామిడి మండలం చిగురుమామిడి, నవాబ్ పేట, రామంచ, చొప్పదండి మండలం భూపాలపట్నం, కట్నేపల్లి, రాగంపేట, రేవెల్లి, ఇల్లంతకుంట మండలం బుజునూరు, గంగాధర మండలం చర్లపల్లి(ఒకటి కొత్తది, మరో పాత భవనం మాడిఫికేషన్), గన్నేరువరం మండలం జంగపల్లి, హుజురాబాద్ మండలం కందుగుల, కరీంనగర్ మండలం మందులపల్లి, కేశవపట్నం మండలం తాడికల్, కొత్తపల్లి మండలం కమాన్‌పూర్, మానకొండూరు మండలం గంగిపల్లి, ఖాదర్ గూడెం, కొండపలకల, ఊటూరు(2), రామడుగు మండలం దేశరాజుపల్లి(2), లక్ష్మీపూర్, మోతె, వెదిర(2), తిమ్మాపూర్ మండలం మహత్మా నగర్, వీణవంక మండలం చల్లూరు, పోతిరెడ్డిపల్లి, వల్లభాపూర్, వీణవంక, చల్లూరు, ఇప్పలపల్లి అంగన్ వాడీలకు కొత్త భవనాలు మంజూరయ్యాయి.