కరీంనగర్ ఐటీ టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏసీలు పని చేయట్లే

కరీంనగర్ ఐటీ టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఏసీలు పని చేయట్లే
  • టేబుల్ ఫ్యాన్లతో ఆఫీసుల నిర్వహణ
  •  ఉక్కపోత భరించలేక వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చిన మూడు కంపెనీల నిర్వాహకులు
  •  పట్టించుకోని ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఐటీ టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏసీలు పనిచేయట్లేదు. దీంతో టేబుల్ ఫ్యాన్లతో ఆఫీసులు నిర్వహించాల్సి వస్తోంది. ఎండాకాలం కావడంతో వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ టవర్ మెయింటనెన్స్ చూడాల్సిన ఇండస్ట్రియల్ ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని, నెల రోజులుగా అవస్థలు అవుతున్నామని కంపెనీల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీలు పనిచేయక ఉక్కపోతను భరించలేక మూడు కంపెనీల నిర్వాహకులు తమ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించారు. మరికొన్ని కంపెనీలు కూడా ఎండాకాలం ముగిసే వరకు వర్క్ ఫ్రం హోంకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.  

మొదటి నుంచి ఇదే సమస్య.. 

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐటీ టవర్ అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ.. ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించలేదు. మొదట 11 కంపెనీల వరకు ఉండగా.. రెండేళ్ల క్రితమే నాలుగు కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించగా.. మరికొన్ని కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  ప్రస్తుతం 8 కంపెనీల్లో 300 మంది వరకు పనిచేస్తున్నారు. 

ఈ ఐటీ టవర్ లో మొదటి నుంచి ఏసీల విషయంలో సమస్య ఉంది. ఎండాకాలం మొదలు కాకముందే ఏసీలను రిపేర్  చేయించాల్సి ఉండగా ఇండస్ట్రియల్ ఆఫీసర్లు పట్టించుకోలేదు. దీంతో నెల రోజులుగా ఏసీలు పనిచేయక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఇటీవల రిపేర్ల అనంతరం ఒక్క ఐదో ఫ్లోర్ లో తప్ప మిగతా నాలుగు ఫ్లోర్లలో ఏసీలు పనిచేయడం లేదు. దీంతో మండు వేసవిలోనూ ఫ్యాన్లు వేసుకుని పనిచేయాల్సి వస్తోంది. ఐదు ఫ్లోర్లు, 50 వేల ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీతో నిర్మించిన కరీంనగర్ ఐటీ టవర్ లో ఇంకా సగం స్పేస్ ఖాళీగానే ఉందని, ఇలా సమస్యలుంటే కొంత కంపెనీలు ఎలా వస్తాయని ఓ కంపెనీ సీఈవో అభిప్రాయం వ్యక్తం చేశారు.