కరీంనగర్ పబ్లిక్కు.. మరీ ముఖ్యంగా సిటీలో ఉండేటోళ్లకు గుడ్ న్యూస్

కరీంనగర్ పబ్లిక్కు.. మరీ ముఖ్యంగా సిటీలో ఉండేటోళ్లకు గుడ్ న్యూస్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) కొత్త మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులు పూర్తి కావొచ్చాయి. కరీంనగర్ సిటీతో పాటు చుట్టూ 62 గ్రామాల పరిధిలో 2041 వరకు ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు సుడా రూపొందించిన మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ను మార్చి చివరి వారంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అమృత్ స్కీమ్ గైడ్ లైన్స్, అర్బన్ డెవలప్ మెంట్ ప్లాన్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్(యూడీపీఎస్ఐ) మార్గదర్శకాల ప్రకారం కరీంనగర్ సిటీ విస్తరణ, భవిష్యత్ నగర అవసరాలు, ఇండస్ట్రీయల్ కారిడార్ల ఏర్పాటు, జిల్లా ఆర్ధిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. అప్పట్లోనే మాస్టర్ ప్లాన్పై ఏవైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా 90 రోజుల్లోపు ఇవ్వాలని నోటిఫి కేషన్లో పేర్కొన్నారు. అభ్యంతరాల స్వీకరణ జూన్ 28తో ముగియడంతో అభ్యంతరాలను పరిశీలించి ప్లాన్ లో చేర్పులు, మార్పులు చేసే పనిలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు.

మాస్టర్ ప్లాన్ పై 41 అభ్యంతరాలు..
మాస్టర్ ప్లాన్పై అభ్యంతరాల గడువు ముగిసేనాటికి కరీంనగర్ సిటీనుంచి 20. రూరల్ ఏరియాల నుంచి 21 అభ్యంతరాలు, సూచనలు వచ్చినట్లు సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి వెల్లడించారు. వీటిని 10 రోజులుగా ఫీల్డ్ లెవల్లో పరిశీలించిన చైర్మన్, వైస్ చైర్మన్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు సరైన సూచనలు, అభ్యంతరాలుగా అనిపిస్తే మాస్టర్ ప్లాన్ మార్పులు చేస్తున్నారు. రింగ్ రోడ్డుకు సంబంధించి తమ సర్వే సంబర్ల మీదుగా కాకుండా మరో ఏరియా నుంచి రోడ్డు వెళ్లేలా చూడాలని కాసింపేట ఊరి నుంచి ఎక్కు వగా అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది. ఇండస్ట్రియ ల్ జోన్ నుంచి తమ సర్వే నంబర్లను తీసేయాలని ఈ జోన్ పరిధిలోకి వచ్చే చెంజర్ల, బద్దిపల్లి, ఒద్యారం, నాగులమల్యాల్లోని కొందరు రైతులు వినతిపత్రా. లు సమర్పించినట్లు సమాచారం.

అలాగే సిటీలో 100 ఫీట్ల రోడ్లుగా విస్తరించేందుకు ప్లాన్ లో కొన్ని రోడ్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ రోడ్డు విస్తరణతో ఇళ్లు కోల్పోయే అవకాశమున్న కొందరు రోడ్డును 100 ఫీట్ల నుంచి 60 ఫీట్లకు తగ్గించాలని, 80 ఫీట్లకు తగ్గించాలని అభ్యంతరాలు వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. వీటన్నింటిని పరిశీలించాక వినతులు. సమర్పించిన వారికి రాతపూర్వకంగా సమాధానం ఇవ్వనున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ న్ను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్టు అం దజేయనున్నట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వెల్లడించారు.

మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే.. వేగంగా అభివృద్ధి
కొత్త మాస్టర్ ప్లాన్లో భాగంగా కరీంనగర్-హైద రాబాద్ రాజీవ్ రహదారిని లింక్ చేస్తూ మొదలయ్యే ఓఆర్ఆర్లోని ఒక భాగం గునుకుల కొండాపూర్, జంగపల్లె, మాదాపూర్, ఖాసింపేట, పారువెల్ల, ఒద్యారం, నాగుల మల్కాల్, కొక్కెరకుంట, వెలిచాల శివారు మీదుగా కరీంనగర్ జగిత్యాల హైవేను కనెక్ట్ చేస్తుంది. మళ్లీ కొత్తపల్లికి కొంతదూరంలో కరీంనగ ర్ జగిత్యాల హైవేతో కనెక్టవుతూ కొక్కొరకుంట, జూ బ్లీనగర్, ఎలబోతారం, ఇరుకుల్ల, దుర్శేడు, బొమ్మ కల్ శివారులో మానేరు మీదుగా మానకొండూరు. పోరండ్ల, ముంజంపల్లె, నుస్తులాపూర్ శివారు ప్రాం తాలను కలుపుతూ రాజీవ్ రహదారితో కనెక్ట్ అయి ముగుస్తుంది. కరీంనగర్ సిటీ వెంట ఎల్ ఎండీతోపా టు చుట్టూ నేషనల్, స్టేట్ హైవేలు ఉండడంతోరింగ్ రోడ్డుఒక చోట ముగిసి మరోచోట స్టార్ట్ అవుతోంది. సుమారు 20 గ్రామాల శివార్ల మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది.

అభ్యంతరాల పరిశీలన పూర్తి కావొచ్చింది..
సుడా మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాల పరిశీలన దాదాపు పూర్తి కావొచ్చింది. 200 ఫీట్ల వెడల్పుతో రింగు రోడ్డు నిర్మాణం పూర్తయితే కరీంనగర్ రూపురేఖలు మారిపోనున్నాయి. అలాగే నగర భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతిపాదించిన స్పెషల్ ఇండస్ట్రీయల్ జోన్లతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి. ఆమోదం కోసం త్వరలోనే మాస్టర్ ప్లాన్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నాం.

కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్