కర్మాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డెన్ హిస్టరీ

కర్మాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డెన్ హిస్టరీ

 తష్కెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  టాప్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆసియా సీనియర్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ నెగ్గిన తొలి ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చరిత్ర సృష్టించింది. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దీప చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో 30 ఏండ్ల దీప 13.566 యావరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించింది. నార్త్ కొరియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిమ్ సన్ హ్యాంగ్ (13.466), జో క్యాంగ్ బైయోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (12.966) సిల్వర్, బ్రాంజ్ ఖాతాలో వేసుకున్నారు. 

రియో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచిన దీప కర్మాకర్ 2015లో జరిగిన ఆసియా చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్ గెలిచింది. అదే ఏడాది ఫ్లోర్ ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆశీష్ కుమార్ కూడా బ్రాంజ్ నెగ్గగా, ప్రణతి నాయక్ 2019, 2022 ఎడిషన్లలో వాల్ట్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంస్య పతకాలు ఖాతాలో వేసుకుంది. డోపింగ్ తప్పిదం కారణంగా 21 నెలల సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుర్కొని గతేడాది తిరిగి బరిలోకి దిగిన కర్మాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనడం లేదు..