
బెంగళూరు: మహిళా ఉద్యోగులకు నెలకు ఒక రోజు వేతనంతో కూడిన నెలసరి సెలవు (మెన్ స్ట్రువల్ లీవ్)ను కర్నాటక ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వ ఉద్యోగినులతోపాటు అన్ని ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగినులకూ ఈ లీవ్ వర్తిస్తుంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి హెచ్ కే పాటిల్ వెల్లడించారు.
అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యాన్ని పెంచడం, వాళ్ల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే ఇప్పటికే బిహార్, ఒడిశా, కేరళ, సిక్కిం రాష్ట్రాలు ఈ తరహా సెలవును అందిస్తున్నాయి. జొమాటో, స్విగ్గీ, ఎల్ అండ్ టీ, సంస్థలూ తమ ఉద్యోగినులకు ఈ లీవ్ ఇస్తున్నాయి.