కర్ణాటక కేబినెట్ విస్తరణ

కర్ణాటక కేబినెట్ విస్తరణ

కర్ణాటక ముఖ్యమంత్రి  బీఎస్ యడియూరప్ప తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో 17 మంది కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ వజుభాయ్‌ వాలా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో …సోమన్న రవి, బసవరాజు, నివాస్‌ పుజారి, మధుస్వామి, చిన్నప్పగౌడ, నగేష్‌, ప్రభు చవాన్‌, శశికళ, అన్నాసాహెబ్‌, గోవింద్‌, అశ్వస్థ నారాయణ్‌, ఈశ్వరప్ప, అశోక్‌, జగదీష్‌ షెట్టర్‌, శ్రీ రాములు, సురేష్‌ కుమార్‌, చంద్రకాంత్‌ ఉన్నారు.