బెంగళూరు వరద బాధితులకు 25 వేల సాయం

బెంగళూరు వరద బాధితులకు 25 వేల సాయం

బెంగళూరులో భారీ వర్షాలు.. నీట మునిగిన ఇళ్లు
కర్నాటక సీఎం ప్రకటన

భారీ వర్షాలు బెంగళూరు సిటీని అతలాకుతలం చేశాయి. రోడ్లు జలమయమై పలు కాలనీల్లో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. వరద తీవ్రతకు వెహికల్స్ కొట్టుకుపోయాయి. శనివారం కర్నాటక సీఎం యడియూరప్ప హొసకెరెహళ్లిలో నీట మునిగిన కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘650 నుంచి 700 ఇండ్లు నీట మునిగాయి. బాధితులకు రూ.25 వేల చొప్పున సాయం అందిస్తాం. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులు అలర్ట్ గా ఉండాలి. వరద పరిస్థితి ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు
తీసుకోవాలి’’ అని ఆదేశించారు.

For More News..

పండగపూట విషాదం.. ఇంటి పైకప్పు కూలి ఒకే ఇంట్లో అయిదుగురు మృతి

ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు

దుబ్బాక ఎన్నికల ముందు సిద్దిపేట కలెక్టర్ బదిలీ