సీఎం సిద్దూ.. ఏందీ నాన్సెన్స్?

సీఎం సిద్దూ.. ఏందీ నాన్సెన్స్?

బెంగళూరు: కర్నాటక సీఎం సిద్ధరామయ్య నివాసం ఎదుట హైడ్రామా చోటుచేసుకుంది. సీఎం నివాసానికి ఎదురుగా ఉంటున్న వృద్ధుడు నరోత్తం.. సిద్ధరామయ్య కారుకు అడ్డుపడ్డారు.  సిద్ధరామయ్య ను కలిసేందుకు వస్తున్న వారి వల్ల తమకు పార్కింగ్ సమస్యలు వస్తున్నా యని, దీన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

 సిద్ధరామయ్య బయటికి వెళ్తున్న టైమ్​లో అడ్డుకున్న పెద్దాయన.. సిద్ధరామయ్యను కలిసేందుకు వచ్చే వారంతా తమ కార్లతో అక్కడి స్థలాన్ని నింపేస్తున్నా రని, తమ వాహనాలను బయటికి తీసేందుకు, పార్క్ చేసేందుకు ఇబ్బంది అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఐదేండ్లుగా ఏందీ నాన్సెన్స్? మేం విసిగిపోయాం” అని అసహనం వ్యక్తం చేశారు. స్పందించిన సిద్ధూ.. పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యను పరిష్కరించాల ని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి పాత బంగ్లాలోనే సిద్ధూ ఉంటున్నారు. ఇంకా అధికారిక నివాసానికి మారలేదు. ఆగస్టులో అక్కడికి ఆయన వెళ్లే అవకాశం ఉంది.