ఆ ఐదు హామీలు ఈ ఏడాది నుంచే అమలు .. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

ఆ ఐదు హామీలు ఈ ఏడాది నుంచే అమలు .. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు హామీలను ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ( జూన్ 2) క్యాబినేట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో  తాము ఇచ్చిన ఆ ఐదు వాగ్దానాలపై కట్టుబడి ఉన్నామని, కులమతాలకు తావులేకుండా ప్రతి ఒక్కరికి ఐదు సంక్షేమ పథకాలు  అమలు చేస్తామని తెలిపారు. 

ఒక్క గృహలక్ష్మి పథకం తప్ప మిగతా పథకాలను తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గృహలక్ష్మి పథకాన్ని మాత్రం ఆగస్టు 15న ప్రారంభిస్తామని కర్నాటక  సీఎం తెలిపారు.  ఎన్నికల సమయంలో గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్నభాగ్య, యువనిధి, శక్తి అనే ఐదు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చింది. అనుకున్నట్లుగానే  సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆ ఐదు గ్యారెంటీల ఫైల్ పై సంతకం చేశారు.