RSSది తాలిబాన్ మనస్తత్వం..యతీంద్ర సిద్ధరామయ్య

RSSది తాలిబాన్ మనస్తత్వం..యతీంద్ర సిద్ధరామయ్య

కర్నాటక సీఎం కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య

బెంగళూరు: ఆర్ఎస్ఎస్ ది తాలిబాన్ లాంటి మనస్తత్వం అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య తెలిపారు. తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారత్ లో పర్యటిస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఓ కార్యక్రమంలో యతీంద్ర సిద్ధరామయ్య మాట్లాడారు.

 “ఆర్ఎస్ఎస్ ది తాలిబాన్ లాంటి మనస్తత్వం. ఒకే మతానికి చెందిన ప్రజలంతా ఒకే మార్గంలో నడవాలని వారు నమ్ముతారు. ఇస్లాంను ఒక ప్రత్యేక మార్గంగా ఉండేలా తాలిబన్లు ఆదేశాలు జారీ చేస్తారు.  వారు మహిళల స్వేచ్ఛను హరిస్తారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్  కూడా హిందూ మతాన్ని ప్రత్యేకంగా ఉంచాలని కోరుకుంటుంది’’ అని పేర్కొన్నారు. 

కాగా, ఆర్ఎస్ఎస్ అనేది ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్ సంస్థ అని దానికి నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ రిజిస్టర్డ్ సంస్థ కానప్పటికీ దానికి వందల కోట్ల నిధులు అందుతున్నాయని ఆరోపించారు. బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ పప్పెట్ అని విమర్శించారు.