బెంగళూరు: లాక్ డౌన్ రూల్స్ ను కర్నాటక సీఎం యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర అతిక్రమించారు. లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించి నంజన్ గూడ్ లోని శ్రీకాంతేశ్వర ఆలయాన్ని విజయేంద్ర తన భార్యతో కలసి దర్శించారు. ఈ క్రమంలో అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై ఉన్న రూల్స్ ను బ్రేక్ చేశారు. అలాగే మూసేసి ఉన్న ఆలయాన్ని సందర్శించారు. దీంతో విజయేంద్రతో పాటు యడ్యూరప్ప మీద విమర్శలు వస్తున్నాయి. ఇది వీఐపీ ట్రీట్ మెంట్ అంటూ విపక్ష నేతలు కామెంట్లు చేస్తున్నారు.
