Karnataka exit poll results : కర్ణాటకలో గెలుపెవరిది.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా..

Karnataka exit poll results : కర్ణాటకలో గెలుపెవరిది.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మే 10వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన ఓటింగ్.. సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. ప్రధానంగా బీజేపీ – కాంగ్రెస్ – జేడీఎస్ పార్టీల మధ్యే పోటీ జరిగింది. 2 వేల 615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 66 శాతం  నమోదైంది. కర్ణాటకలో యువ ఓటర్లు 11 లక్షల 71 వేలుగా ఉండగా.. పోలింగ్ స్టేషన్ల దగ్గర యువత సెల్ఫీల హడావిడి నడిచింది. కర్ణాటకలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా 113 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. 

వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ :

ఆత్మ సాక్షి సర్వే :

బీజేపీ : 83 – 94
కాంగ్రెస్ : 117 – 124
జేడీఎస్ : 23 – 30
ఇతరులు : 02 – 08

పీపుల్స్ పల్స్ సర్వే :

బీజేపీ : 78 – 90
కాంగ్రెస్ : 107 – 119
జేడీఎస్ : 23 – 29
ఇతరులు : 01 – 03

రిపబ్లిక్ టీవీ సర్వే  :

బీజేపీ : 85 – 100
కాంగ్రెస్ : 94 – 108
జేడీఎస్ : 24 – 31
ఇతరులు : 02 – 06

జన్ కీ బాత్ సర్వే :

బీజేపీ : 94 – 117
కాంగ్రెస్ : 91 – 103
జేడీఎస్ : 14 – 24
ఇతరులు : 0 – 4

పొలిటికల్ ల్యాబరేటరీ సర్వే :

బీజేపీ : 80 
కాంగ్రెస్ : 108
జేడీఎస్ : 32 
ఇతరులు : 04

ఇండియా టుడే సర్వే :

బీజేపీ : 74 – 86
కాంగ్రెస్ : 107 – 119
జేడీఎస్ : 17 – 20
ఇతరులు : 0 – 3

ఏబీపీ – సీ ఓటర్ సర్వే :

బీజేపీ : 74 – 86
కాంగ్రెస్ : 107 – 119
జేడీఎస్ : 23 – 35

జీ న్యూస్ సర్వే :

బీజేపీ : 103 – 115
కాంగ్రెస్ : 79 – 91
జేడీఎస్ : 26 – 36

జీ మ్యాట్రిస్ సర్వే:

బీజేపీ- 79 -94
కాంగ్రెస్- 103 - 118
జేడీఎస్- 25- 33

టైమ్స్ నౌ సర్వే :

బీజేపీ 114
కాంగ్రెస్ 86
జేడీయూ 21
ఇతరులు 3