ముగిసిన ఎన్నికలు...ఎంత శాతం పోలింగ్ నమోదైంది

 ముగిసిన ఎన్నికలు...ఎంత శాతం పోలింగ్ నమోదైంది

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా  జరిగింది.  సాయంత్రం 5 గంటల వరకు 65. 69 శాతం పోలింగ్‌ నమోదైంది.  సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతించారు.  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఇక 80ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఈసీ చేసింది. 

రాష్ట్ర వ్యాప్తంగా 37,777 ప్రాంతాల్లో 58,545 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2613 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలోకి చేరింది. మే 13వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు కావాల్సి ఉంది.