
బెంగళూరు : లోక్ సభ ఎన్నికలకు ఏర్పాట్లు చేసే పనిలో ఉంది ఎలక్షన్ కమిషన్. ఈ క్రమంలోనే ఓటర్లకు EVM, వీవీన్యాట్ లపై అవేర్ నెస్ కార్యక్రమాలను చేపడుతుంది. అయితే ఓ పెళ్లి వేడుకలో ఈ కార్యక్రమాన్ని పెట్టడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
కర్ణాటకలోని హట్టి గ్రామానికి చెందిన నూతన దంపతుల కోరిక మేరకు తమ పెళ్లి వేడుకలో ఎన్నికల అధికారులు ఈవీఎం, వీవీప్యాట్‌లను ప్రదర్శనకు ఉంచారు. EVMలో ఎలా ఓటేయాలి.. మనం ఓటేవరికి వేశామో వీవీప్యాట్ ద్వారా గుర్తించే అంశాలపై పెళ్లికి వచ్చిన వారందరికీ అధికారులు అవగాహన కల్పించారు.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు కర్ణాటక ఎలక్షన్ అధికారులు. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి.
Karnataka: Election Commission officials demonstrated the use of EVM & VVPAT, at a mass marriage function in Hatti village of Koppal district, on couples' request. Guest at the wedding also participated in the public awareness campaign. (13.03) pic.twitter.com/s3tX9fs7WD
— ANI (@ANI) March 14, 2019