
దాదాపు 13వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పాత పెన్షన్ స్కీమ్ పరిధిలోకి చేర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఈ ఉద్యోగులు 2006 తర్వాత రిక్రూట్ అయ్యారు. కొత్త పెన్షన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడంతో.. ఈ డిమాండ్‌ను నెరవేర్చడానికి తాము కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్చం చేశారు.
2006 తర్వాత రిక్రూట్ అయిన రాష్ట్ర ప్రభుత్వంలోని దాదాపు 13వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని సిద్ధరామయ్య చెప్పారు. ఎన్నికల ముందు కూడా తాను అక్కడికి వెళ్లి వారికి హామీ ఇచ్చానని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మెలో ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) ఉద్యోగుల డిమాండ్ నెరవేస్తామని చెప్పామని పేర్కొన్నారు. ఈ నిర్ణయం 13వేల మంది ఎన్‌పిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఓదార్పునిస్తుందని ఆశిస్తున్నానని అన్నారాయన.
2006 ಏಪ್ರಿಲ್ ಪೂರ್ವ ನೇಮಕಾತಿ ಅಧಿಸೂಚನೆಯಾಗಿ 2006 ರ ನಂತರ ನೇಮಕಾತಿಗೊಂಡ ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ಸುಮಾರು 13,000 ಸರ್ಕಾರಿ ನೌಕರರಿಗೆ ಹಳೆ ಪಿಂಚಣಿ ಯೋಜನೆ ವ್ಯಾಪ್ತಿಗೆ ಒಳಪಡಿಸಿ ಆದೇಶ ಹೊರಡಿಸಲಾಗಿದೆ.
— Siddaramaiah (@siddaramaiah) January 24, 2024
ಚುನಾವಣೆಗೂ ಪೂರ್ವದಲ್ಲಿ ಎನ್.ಪಿ.ಎಸ್ ನೌಕರರು ಮುಷ್ಕರು ಮಾಡುವ ವೇಳೆ ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿನೀಡಿ ನಾವು ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ನಂತರ ಬೇಡಿಕೆ… pic.twitter.com/IJTzZACw2R