SBI, PNBలకు కర్ణాటక సర్కార్ షాక్..అకౌంట్లను క్లోజ్ చేయండి..శాఖలకు ఆదేశం 

SBI, PNBలకు కర్ణాటక సర్కార్ షాక్..అకౌంట్లను క్లోజ్ చేయండి..శాఖలకు ఆదేశం 

SBI, PNB బ్యాంకులకు కర్ణాటక ప్రభుత్వం గట్టి షాకిచ్చింది.  ఈ రెండు బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ శాఖలు, సంస్థలకు చెందిన అకౌంట్లను తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ బ్యాంకుల్లో డిపాజిట్లు, పెట్టుబడుల నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు వస్తున్నఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 

కర్ణాటక సీఎం సిద్దరామయ్య సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.SBI, PNB బ్యాంకులతో అన్ని రకాల లావాదేవీలను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ రెండు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను వెంటనే క్లోజ్ చేయాలని ప్రభుత్వ శాఖలను  ఆదేశించింది.ఆ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్న క్రమంలో సిద్దరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  సీఎం సిద్దరామయ్య ఆమోదించిన ఉత్తర్వులను రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి బుధవారం ఆగస్టు 14, 2024న సాయంత్రం జారీ చేసింది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , పంజాబ్ నేషన్ బ్యాంకులో రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, ఇతర  ప్రభుత్వ సంస్థలు తమ ఖాతాలను వెంటనే రద్దు చేయాలని , ఈ బ్యాంకుల్లో ఇకముందు డిపాజిట్లు గానీ, పెట్టుబడులు గానీ పెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది.