బెంగళూరులో ‘అపార్టుమెంట్ల’పై బ్యాన్‌‌‌‌!

బెంగళూరులో ‘అపార్టుమెంట్ల’పై బ్యాన్‌‌‌‌!

నీటి కష్టాలతో కర్ణాటక సర్కారు యోచన

బెంగళూరు: నీళ్ల కష్టాలు బెంగళూరు రియల్టర్లను తాకనున్నాయి. దాదాపు ఐదేళ్ల పాటు నగరంలో కొత్త అపార్టుమెంట్ల నిర్మాణాన్ని నిలిపేయాలని కర్ణాటక సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు ప్రపోజల్ పెట్టినట్లు డిప్యూటీ సీఎం పరమేశ్వర వెల్లడించారు. ఈ సందర్భంగా నీళ్ల సరఫరా లేకుండా అపార్ట్ మెంట్లను ఎలా అమ్ముతారన్న ప్రశ్న చర్చకు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే నగరవాసులు నీటి కటకట ఎదుర్కొంటున్నారని చెప్పారు. బయట ట్యాంకర్లు తెప్పించుకుంటున్న వాళ్లకు చర్మ వ్యాధులు వస్తున్నాయని వివరించారు. అతి త్వరలో పెద్దాఫీసర్లు డెవలపర్స్ తో అపార్ట్ మెంట్ల నిర్మాణం ఆపే ప్రపోజల్ పై చర్చిస్తారని పరమేశ్వర పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం ప్రకటనపై చాలా మంది రియల్టర్లు నిస్సహాయతను వ్యక్తం చేశారు. ‘రానురాను బెంగళూరు అవసరాలు బాగా పెరిగిపోయాయి. ప్లానింగ్ అథారిటీ వీటిని ముందే ఊహించాల్సింది. రియల్టర్లుగా మేం మా పని చేశాం. రూల్స్ ప్రకారం అపార్టుమెంట్లు కట్టాం’ అని స్టెర్లింగ్ డెవలపర్స్ చైర్మన్ రమణి శాస్త్రి పేర్కొన్నారు.