రెండు వారాలపాటు నిరసనలపై నిషేధం

రెండు వారాలపాటు నిరసనలపై నిషేధం

కర్నాటకలో హిజాబ్ రగడ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అక్కడి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగుళూరులో రెండు వారాల పాటు నిరసనలపై నిషేధం విధించింది. బెంగళూరులో విద్యాసంస్థలైన స్కూల్స్, కాలేజీల వద్ద రెండు వారాల పాటు ఆందోళనలు జరపకూడదని నిషేదాజ్ఞలు విధించారు. పోలీసుల ఆదేశాల మేరకు ఏదైనా గుమిగూడటం లేదా ఆందోళన చేయడానికి అనుమతుల్లేవు. స్కూల్స్, కాలేజి చుట్టూ వైపుల 200మీటర్ల మేర రూల్స్ వర్తిస్తాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను జడ్జి ఉన్నత ధర్మసనానికి బదిలీ చేశారు. జడ్జి ప్రతిపాదనపై ఇరు వర్గాలు విముఖత వ్యక్తం చేశాయి. 

ఉడుపిలోని గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. హిజాబ్ పై నిబంధనలు ఎందుకని ప్రశ్నలు అందులో ఉంచారు. ఈ పిటిషన్ ను పెద్ద బెంచ్ కు బుధవారం రిఫర్ చేశారు. అయితే విద్యా సంస్థల్లో డ్రెస్ కోడ్ ఉండాలని బొమ్మై ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు హిజాబ్‌పై నిషేధం ఎత్తివేయాలని పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు. తమ మత విశ్వాసాలు పాటించే హక్కు విద్యార్థులకు ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. మరోవైపు ఏజీ డ్రెస్ కోడ్ నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. విద్యార్థులు తప్పకుండా డ్రెస్ కోడ్‌ను పాటించాలన్నారు ఏజీ. 

మరొవైపు విద్యార్థులంతా శాంతి, సామరస్యంతో ఉండాలని పిలుపునిస్తూ కర్ణాటక సీఎం మూడు రోజుల పాటు విద్యాసంస్థలు మూసేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే, కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోఖ తాము (ప్రభుత్వం) హిజాబ్ కు గానీ, కాషాయానికి గానీ దేనికీ సపోర్టింగ్ గా లేమంటూ వ్యాఖ్యలు చేశారు. 

ఇవి కూడా చదవండి: 

పాకిస్థాన్ మంత్రికి ఒవైసీ చురకలు

పేకాట ఆడిన ముఖ్యమంత్రి