పేకాట ఆడిన ముఖ్యమంత్రి

పేకాట ఆడిన ముఖ్యమంత్రి

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌ జిత్ సింగ్ చన్నీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈరోజు బర్నాలాలోని అస్పాల్ ఖుర్ద్‌లో  ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. స్థానికులతో క్రికెట్ ఆడి చన్నీ సందడి చేశారు. పెద్దలతో కలిసి ప్లేయింగ్ కార్డులు కూడా ఆడారు చన్నీ. దీంతో సీఎం చన్నీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చరణ్ జిత్ సింగ్ చన్నీని పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. చరణ్‌జిత్ సింగ్ చన్నీనే కాంగ్రెస్ తరపు ముఖ్యమంత్రి అభ్యర్థి అని రాహుల్ గాంధీ ఇటీవలే ప్రకటించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ కొనసాగుతున్నారు. పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 

 జనవరి 8న ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పంజాబ్ లో ఫిబ్రవరి 14న ఎన్నిక జరగాల్సి ఉంది.అయితే ఎన్నికలను ఫిబ్రవరి 20కు వాయిదా వేశారు. ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతి ఉంది. దానికి సంబంధించిన ఉత్సవాలు ముందుగానే ప్రారంభమవుతాయి. వేడుకల్లో పాల్గొనేందుకు దాదాపు 20లక్షల మంది భక్తులు పంజాబ్ నుంచి ఉత్తర్ప్రదేశ్లోని వారణాసికి వెళ్తారు. దీంతో వారంతా ఫిబ్రవరి 14న జరిగే పోలింగ్ లో ఓటు వేసే అవకాశం కోల్పోతారని అన్ని పార్టీలు ఈసీకి తెలిపాయి. దీంతో ముఖ్యమంత్రి చరణ్ జీత్ చన్నీ సైతం పోలింగ్ ను వారం పాటు వాయిదా వేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో సమావేశమైన కేంద్ర ఎన్నికల కమిషన్ పార్టీల అభ్యర్థన మేరకు పోలింగ్ వాయిదా వేసింది. ఫిబ్రవరి 20 ఎన్నికల ఓటింగ్ నిర్వహించనుంది.

ఇవి కూడా చదవండి: 

ఐపీఎల్ లో కొత్త జట్టు పేరు గుజరాత్ టైటాన్స్