ఉడిపిలో పాఠశాలల దగ్గర 144 సెక్షన్ 

ఉడిపిలో పాఠశాలల దగ్గర 144 సెక్షన్ 

హిజాబ్  వివాదం వల్ల  కర్ణాటకలో మూతబడిన  స్కూళ్లు  తిరిగి ప్రారంభమయ్యాయి. కళాశాలలు, యూనివర్సిటీల  ఓపెనింగ్ పై  మాత్రం ఇంకా  నిర్ణయం తీసుకోలేదు కర్ణాటక ప్రభుత్వం. అయితే ముందస్తు  చర్యల్లో భాగంగా  ఈ నెల 19 వరకు  ఉడిపిలోని  అన్ని పాఠశాలల దగ్గర  144 సెక్షన్ విధించింది.  శాంతియుత  వాతావరణం కోసం  పేరెంట్స్, టీచర్లతో  మీటింగ్ ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల  పోలీసులకు  ఆదేశాలు జారీ  చేసింది ప్రభుత్వం.  హిజాబ్ అనుకూల , వ్యతిరేక ఆందోళన  మధ్య  కర్ణాటకలో ఈనెల  9 నుంచి మూడ్రోజుల పాటు  ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈనెల 14 నుంచి  పదో తరగతి వరకు  స్కూళ్లు తెరవాలని  ఫిబ్రవరి 10న  నిర్ణయించింది కర్ణాటక ప్రభుత్వం.  ఈ వివాదంపై  విచారణలో భాగంగా... స్కూళ్లు,  కాలేజ్ లు  తెరవాలని  కర్ణాటక హైకోర్టు మధ్యంతర  తీర్పులో  పేర్కొంది. తరగతి గదుల్లో  విద్యార్థులు శాలువాలు,  హిజాబ్ లు, స్కార్ఫ్ లు, మతపరమైన  జెండాల వంటివి  ధరించకుండా  చూడాలని  కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరిన్ని వార్తల కోసం

 

భీమ్లా నాయక్ నుంచి కొత్త కబురు

అన్న కోసం ప్రాణాలైనా ఇస్తా